వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనంలో తెల్లపొడి ప్యాకట్ కలకలం సృష్టించింది. యునెటైడ్ సీక్రెట్ సర్వీస్ సిబ్బంది తెల్లపొడిని శ్వేతసౌధంలో గుర్తించారు. అప్రమత్తమైన సిబ్బంది ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా భవనాన్ని ఖాళీ చేయించారు. పొడిని ల్యాబ్‌కు పంపగా దానిని కొకైన్‌గా గుర్తించారు. అది శ్వేతసౌధంలోకి ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఇదంతా జరిగినప్పుడు అధ్యక్షుడు బైడెన్ కుటుంబం శ్వేతసౌధంలో లేరు.