Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఇందుగుపల్లి మూలమలుపు – ప్రమాదానికి పిలుపు

విశాలాంధ్ర` వత్సవాయి : మూల మలుపుల్లో మందస్తు ప్రమాదపు సూచిక బోర్డులు లేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా అధికారులు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న మూల మలుపుల వద్ద ముందస్తు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించలేకపోతున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి మండలంలోని ఇందుగుపల్లి గ్రామంలోని దేవాలయం ఎదురుగా ఉన్న మూలమలుపు అత్యంత ప్రమాదకరంగా మారింది. రోడ్డు ప్రక్కనే మార్జిన్‌ కూడా లేకుండా డ్రైనేజీ గుంత ఉండి నీరు పారుతూ ఉండడంతో మూలమలుపు వద్ద వాహనదారులు ఆద మరిచినట్లయితే ఇంక అంతే సంగతులు.పలు గ్రామాల్లో ప్రమాదకర మూలమలుపుల వద్ద తరుచూ వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి. గోపినేనిపాలెం- చిన్న మోదుగుపల్లి, వత్సవాయి- వేముల నర్వ, కంభంపాడు- తాళ్లూరు, కాకరవాయి- మాచినేనిపాలెం వెళ్లాలి అంటే ఎక్కువగా మూలమలుపులున్నాయి పలు గ్రామాల్లో రోడ్ల ప్రక్కన కనీస మార్జిన్‌ కూడా లేకపోవడంతో మూలమలుపులు అత్యంత ప్రమాదకరంగా మారాయి….ఈ రోడ్ల ద్వారా అధిక సంఖ్యలో వాహనాలు వెళుతుంటాయి.వేగంగా వచ్చే వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి.
సూచిక బోర్డులు లేక..
ఈరహదారిపై కోన్ని చోట్ల సూచిక బోర్డులు ఉన్నప్పటికి మరికొన్ని చోట్ల సూచికలు లేకపోవడంతో వాహన దారులు అయోమయానికి గురవుతున్నారు. ఇందుగుపల్లి మూలమలుపు వద్ద ప్రమాదాల నివారణకు సూచిక బోర్డు లేకపోవడంతో ఎప్పుడైనా ఒకసారి వచ్చే వాహనదారులు అప్రమత్తత లేకపోవడంతో ఆ గుంతలో పడుతున్నారు.ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మండలంలోని ప్రధాన రోడ్లతో పాటు గ్రామాలను కలిపే రోడ్లు కూడ మూల మలుపులు ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మలుపుల వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో కొత్త ప్రయాణీకులను ప్రమాదానికి గురవుతున్నారు. ప్రమాదం జరిగితే తప్ప స్పందించరా. ప్రమాదం జరగడం కంటే ముందు చర్యలు ఎందుకు చేపట్టరు అని పలువురు వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ప్రమాదకరంగాఉన్న మూలమలుపులు వద్ద ఉన్న గుంతలకు మరమ్మతులు చేయించి ప్రమాదకర మలుపుల వద్ద సూచీలను ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img