London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

సీమ ప్రాజెక్టులపై ప్రభుత్వం చిన్నచూపు

వేదవతి ప్రాజెక్టు పనులను ప్రారంభించాలి
ప్రాజెక్టులు పూర్తి కై మరో ఉద్యమం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య
సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్ర

విశాలాంధ్ర ఆలూరు : రాయలసీమ పరిధిలోని ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి కై మరో ఉద్యమం తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు పి.రామచంద్రయ్య హెచ్చరించారు. శుక్రవారం మండల పరిధిలోని మొలగవళ్లి గ్రామంలో.. వేదవతి ప్రాజెక్టును 8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించి, నియోజకవర్గ పరిధిలోనే అన్ని గ్రామాలకు సాగు, త్రాగు నీరు అందించారని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని జండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆలూరు పట్టణంలోనే అంబేద్కర్ సర్కిల్లో సీపీఐ మండల కార్యదర్శి రామాంజనేయులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముగింపు ఆయన మాట్లాడుతూ జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గం నిత్యం కరువు కాటకాలకు నిలియంగా మారిందని, ప్రతి ఏడాది కూడా ఈ ప్రాంతం నుండి వేల సంఖ్యలో ప్రజలు, రైతులు, యువకులు వలసలకు వెళుతుండటంతో ఈ ప్రాంతం వలసలకు నిలియంగా మారిందన్నారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత అభివృద్ధికై వేదావతి ప్రాజెక్టు నిర్మాణం కోసం గత టిడిపి ప్రభుత్వం రూ.1942 కోట్లతో 80 వేల ఎకరాలకు సాగునీరు, 253 గ్రామాలకు త్రాగునీరు అందించాలన్న లక్ష్యంతో నిర్మాణపు పనులను ప్రారంభించి పునాదులకే పరిమితం చేసిందన్నారు. నేడు వైయస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ రూ. 120 కోట్ల ఖర్చులు పెట్టి పనులు చేపడితే కేవలం రూ.16 కోట్లను నిధులను విడుదల చేయడం చాలా దుర్మార్గమన్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల మీద ఎంత శ్రద్ధ ఉందో ఇట్లే అర్థమవుతుందన్నారు. వేదావతి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కాలువలు, పైప్ లైన్ పనులు కింద భూములు కోల్పోయిన రైతాంగానికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మార్కెట్ కు అదనంగా 5 రెట్లు కలిపి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమ వెనుకబాటుతనం ఎన్నికల అంశంగా మారిపోయిందని, ఎన్నికలలో గెలవడానికి మాత్రమే ప్రాజెక్టుల నిర్మాణాలు ఉపయోగపడతాయని ఆయన విమర్శించారు. వేదవతి ప్రాజెక్టు పరిధిలోకి ఆస్పరి మండలాన్ని చేర్చి మండలంలో అన్ని గ్రామాలకు సాగు,త్రాగునీరు ఇవ్వాలని, ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లోని గురు రాఘవేంద్ర, వేదవతి, పులికనుమ, ఆర్‌డిఎస్‌, హంద్రీనీవా ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గం లో కరువు, వలస పోవాలంటే వేదావతి ప్రాజెక్టును నిర్మించడమే ఏకైక మార్గమని, సాగునీటిని పాలకులు నిర్లక్ష్యం చేయడంతో ఆలూరు నియోజకవర్గం త్వరలో ఎడారిగా మారబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా సమగ్రాభివృద్ధి పట్ల ప్రభుత్వానికి, ఎంపీలు, ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదన్నారు. జిల్లాలో గుండ్రేవుల, వేదవతి, నగరడోన రిజర్వాయర్‌లాంటి ప్రాజెక్టులు నిర్మిస్తే జిల్లా సాగు, తాగునీటి రంగాలలో సస్యశ్యామలమ వుతుందన్నారు. జగన్‌ ప్రభుత్వం ప్రజలకు బటన్‌ నొక్కి తాయిళాలు ఇవ్వడం తప్ప అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. వేదవతి ప్రాజెక్టును 8 టీఎంసీల సామర్థ్యంతో పూర్తి చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో దశల వారి ఉద్యమం నిర్వహిస్తామని, రాజకీయాలకు అతీతంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాలకు మేధావులు, ప్రజలు, రైతులు, యువకులు మద్దతు పలకాలని కోరారు. ఈ పాదయాత్రలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నబీ రసూల్, మద్దిలేటి శెట్టి, విరుపాక్షి, జిల్లా సమితి సభ్యులు నాగేంద్రయ్య, భూపేష్, కృష్ణమూర్తి, ఆలూరు, దేవనకొండ, హొలగుంద మండలాల కార్యదర్శిలు రామాంజనేయులు, నరసరావు, మారెప్ప, ఏపి రైతు సంఘం నాయకులు ఆంజనేయ, చంద్రకాంత్ రెడ్డి, ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షులు శివ, ఏఐవైఎఫ్ నాయకులు రమేష్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img