Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

ఆంజనేయస్వామిని దర్శించుకున్న టిడిపి అభ్యర్థి

విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామిని బుధవారం మంత్రాలయం టిడిపి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. ఇంటి దైవమైన శ్రీ ఆంజనేయస్వామికి రాఘవేంద్ర రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి ఆశిస్సులతో ఎన్నికల ప్రచారానికి వెళుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు హనుమంతరెడ్డి, విజయ్ కుమార్,సురేష్ నాయుడు, నరసన్న, సిద్ధప్ప, సుదర్శణం, లక్ష్మన్న, ఇస్సాక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img