Friday, June 14, 2024
Friday, June 14, 2024

త్రిబుల్ ఐటీ కి విజేత స్కూల్ విద్యార్థి..

అభినందించిన తాసిల్దార్ కుమారస్వామి

విశాలాంధ్ర ఆస్పరి : అస్పరి పట్టణానికి చెందిన ఆర్.పి జితేందర్ సింగ్ ఇడుపులపాయలోని త్రిపుల్ ఐటీ కి ఎంపికయ్యారు. ఈ విద్యార్థి స్థానిక విజేత ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో చదివాడు. సోమవారం సర్పంచ్ మూలింటి రాధమ్మ ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఆర్.పి జితేందర్ సింగ్ ను జిల్లా కేడీసీసీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర, తాసిల్దార్ కుమారస్వామి, డిప్యూటీ తాసిల్దార్ గాయత్రి, ఎంఈఓ రాజేంద్రప్రసాద్, ఈవో ఆర్ డి నరసింహారెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ యమునప్ప, వీఆర్వోలు, రెవిన్యూ సిబ్బంది అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కేడీసీసీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర, తాసిల్దార్ కుమారస్వామి లు మాట్లాడుతూ కష్టపడి చదివి త్రిబుల్ ఐటీ లో సీటు సాధించి తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నాడని కొనియాడారు. అనంతరం విద్యార్థి జితేందర్ సింగ్ మాట్లాడుతూ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులను చక్కగా చదువుకునేందుకు ప్రోత్సహించారని, ప్రత్యేక తరగతులు నా విజయానికి తోడ్పాటు నందించాయని, కరస్పాండెంట్ మల్లేష్, ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మిల సహకారం మరవలేనిదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img