Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

అధికారమైన దాని అహంకారమైన…

  • కె.శరచ్చంద్ర జ్యోతిశ్రీ
    రైతు చెమట చుక్క నేల రాల
    మొలకలెత్తి పైరుగా పైకి లేచి
    పంట గింజలు రాల్చి
    అన్నమై సర్వ మానవాళి
    కడుపు నింపు కనికరమ్మున
    కనిపించని ఆ పర్మాత్మ కన్న
    కంటిముందున్న ఈ రైతన్న గొప్ప
    ఎంచి చూడ ఎన్నడైన గానీ
    రైతు నెత్తురు చుక్క ధరణిపై రాలంగ
    అగ్నికీలలై లేచి ఆగ్రహ జ్వాలలై ఎగసి
    మహోగ్రరూప ఉద్యమమై వ్యాపించు
    దహియించు దగ్ధమొనరించు
    అధికారమైన దాని అహంకారమైన
    తలవంచు కడకు అంతరించు
    ఫాలాక్షు కంటి చూపు కన్న
    రైతన్న నేత్రాగ్ని శక్తి మిన్న
    నిన్న నేడైన రేపైన గానీ
    (పంటలకు కనీస మద్దతు ధర చట్టంకోసం ఉద్యమించిన రైతులపై 21వ తేదీన పంజాబ్‌, హర్యాన సరిహద్దుల్లో పోలీసు బలగాలు జరిపిన దాడుల్లో మరణించిన 21ఏళ్ళ యువ రైతు శుబ్‌ కరణ్‌ సింగ్‌ కు నివాళిగా…)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img