Wednesday, May 29, 2024
Wednesday, May 29, 2024

కవితా మోహన మురళీ వివశ…!

చందు సుబ్బారావు

గ్రీకు చరిత్రకారులకు (క్రీ.పూ) తొలినాళ్ల భయం కవిత్వం గురించే. ‘బాబోయ్‌ యీ కవులు ‘ఏ ముక్క’ అంటే ఏ నిప్పు రగులుతుందో అని. మరి అంతటి శక్తిమంతంగాఉంటాయి కవిపల్కులు. ‘‘పురుషావయవం ఒక మంత్రదండంస్త్రీ గర్భాశయం వసంత వనం’’ అన్న మాటలు వింటే ఎలా ఉంటుంది. మాటలే గదా మనిషిని జంతువుల్నుండి వేరు చేసి నాగరీకుణ్ణిచేసింది. ఆ మాటలు కొంతకాలం మౌఖికం (శీతీaశ్రీ), కొంతకాలం తాళపత్రాలపైనివాసం, కొంతకాలం చర్మాలు చెక్కముక్కలు, కొన్నాళ్లు రాళ్లుశిలాఫలకాలు,..నిన్నగాక మొన్ననేకదండీ కాగితాలూ కలాలూను. అయినా సరే మాటల పొగరు తగ్గలేదు. వాటి శక్తి (ఙఱస్త్రశీబతీ), సన్నగిల్లలేదు. వందలఏళ్లలో పెరిగిందేకాని తరగలేదు. ‘‘రాత్రి గర్భంతో ఉందట. పొద్దున్నే ఎవరినో కనబోతుందట..తన చిన్నిపాప ‘చందమామ’ తో ప్రస్తుతం ఆడుకుంటుందట’’ (!) కవులను చూచి రాజకీయనాయకులు, తత్వవేత్తలు ఈర్ష్య పడేదిందుకే. వాళ్లు నానా కష్టాలుపడి సమాజంగురించి నాలుగు మాటలు చెప్పటానికి ప్రయత్నిస్తారు. ఈ కవిగాడు రాత్రి కలగన్నట్లు ప్రపంచం గురించి కథలు కథలుగా వర్ణిస్తుంటాడు. ‘గ్రెగరీ కార్సో’ అనే కవి
‘‘ఈ కాలం బాగా సాగతీసిన శునకం
తోకతో గుండ్రంగా సున్నాలు చుట్టుకుంటూ జీవితం లోకి లాక్కెళుతుంది’’ అన్నాడు. ఇందులోని ఉత్ప్రేక్ష భావం చూచి ఊగిపోడు పాఠకుడు. కాలం నిజంగానే బతుకులోకి లాక్కెళుతుంది. బాల్యంలో ఆటలు, యవ్వనంలో పాటలు, మరొక అడుగు ముందుకు వేయగానే అప్పటి వరకూ చూడని ఆడపిల్ల శరీరంవైపు అదేపనిగాచూపులు.. నిట్టూర్పులు! తీరా వ్రతంచెడితే అదేశరీరం..అదేవొంపులు. చావుదొంగ వెధవా. స్త్రీ శరీరంఅంటే చిలవల పలవలుగా ఊహిస్తావా. కలం దొరికిందని రాసేస్తావా..వందలూ, వేలూ ప్రేమ కథలా..లోకాన్ని ఉద్ధరించినట్లు నీవేమో ఆదర్శమూర్తి ఫోజులోనా? ఆ గురువులూ..ఆ తాత్వికులూ..ఆ మహాను భావులూ చూడు. మతం అంటే ఏమిటిమనిషంటే ఏమిటి? సమాజానికి దేవుడి అవసరం ఏమిటి. శీలంనడవడి అంటే ఏమిటి..వాటి అవసరం ఏమిటి కార్ల్‌మార్క్స్‌ చూడు ఏమన్నాడో.ష్ట్రవaత్‌ీ శీట ్‌ష్ట్రవ ష్ట్రవaత్‌ీశ్రీవంం షశీతీశ్రీస..ంశీబశ్రీ శీట ్‌ష్ట్రవ ంశీబశ్రీ శ్రీవంం షశీఅసఱ్‌ఱశీఅ…a జూతీశ్‌ీవర్‌ aస్త్రaఱఅర్‌ ఎఱంవతీవ అన్నాడు. దౌర్భాగ్యం మీద తిరుగుబాటుగా భావించాడు. మరి యీ కవులేమిటి…కాయలూపూవులూ..నీళ్లూ..చేపలూ అంటుంటారు. ‘‘సముద్రంలో యీదే మనిషీమొలమీద పొట్టిలాగూ ఎందుకురా. ఏ జంతువుకుందిరా లాగూవాటికి నీలాంటి అవయవాలు లేవా?’’ అని ప్రశ్నించాడట ఒకాయన. అందులో ఉంది అసలు కవిత్వం! అన్నట్లు శృంగార శిఖర సన్నివేశంలోనూ బాధాదగ్ధ హృదయంలోనూ వెళ్లి పోతున్న దేవదాసు శరీరం ‘పాడె’ ను తిలకించి పడిపోయిన పార్వతి’ ముఖంలోనూ సావిత్రి నటనలోనూఅక్కినేని దగ్గులోనూ కవిత్వం దానంతట అదే ఉబుకుతుంది.! అయితే కవిత్వంలో కించిత్తు మోసం, కించిత్తు దగా ఉంటాయి. అందహీనమైన ముహానికి మేలి ముసుగులా మోసం చేయగలదు. ‘‘నీ గుండెల మీద రెండుకొండలు..నీ నుదుట్లో కాలువలు..నీ బుగ్గల్లో చెరువులు నీపైకి చేరిన నాకు స్వర్గారోహణం’’ అంటాడు పురుష పుంగవుడు అన్నీ అబద్ధాలు..తన అవసరం తీరినతక్షణం కొండలూ ఉండవు.. కాలువలూ ఉండవు..‘కొంచెం దూరంగా వెళ్లు’ అంటాడు. కవులు యీ అబద్ధాలకు రంగులుపూస్తారు. కాకిని చిలకను చేస్తారు. వందల పద్యాల ప్రబంధం..ఒక్కముక్క పనికొచ్చేది కనిపించదు. ‘పాండురంగమహత్మ్యంలో కాబోలు తెనాలి రామకృష్ణుడు ‘‘కాపువర్ణ స్నుషయు బ్రాహ్మణాధముండు, బోయకులమున కలిసిరి పొలుపుదక్కి’’ అంటాడు! కులాంతరప్రేమ అని వెళ్లగొట్టారట గ్రామ పెద్దలు. చేసేదిలేక వాళ్లు ఊరొదిలి వెళ్లి ‘బోయ’ల్లో చేరిపోయారట. పాపం వాళ్లు ప్రేమగా వీరిని చేరదీసారట..! వాళ్లకు కులాలు గోత్రాలు తెలియవు కదా!
పోనీ..మంచిభావాలు చెప్పారు లేవయ్యా అనుకుందామాఅంటే..చచ్చుపుచ్చు కల్పనలు..గులకరాళ్లు డబ్బాల్లో సవ్వడి ..‘‘ధంధణు ధాణు ధింధిమివ్రాతనయానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాతమున్‌’’ అంటూ సమాసాల సమోసాలు! గేయాలకు ప్రాణంపోసి హృదయాలకు గాయాలు చేసిన మహాకవి శ్రీశ్రీ కందపద్యాలు చాలా రాశాడు. ఒక కందంలో, తనలా కందం రాసేవాడు కూడా లేడు పొండోయ్‌ అన్నాడు! ‘‘నాలాగ కందబంధ జ్వాలాజాలాగ్ర సంవసత్‌ సద్గీతాలా లాపించే కవితాశ్రీలోలుడు నహినహీతి సిరిసిరిమువ్వా అనేశాడు. కవులకు ఆత్మస్తుతి తెలుగువారి ఆస్తి అనుకోండి. మరొకసందర్భంలోని కందం ఎలాఉందో చూద్దాం.. కృష్ణశాస్త్రిగారు తనకు ‘సన్మానం’ అని నరసరావుపేట వెళ్లాడట. సభలో తన ప్రియమిత్రుడు పేట వాస్తవ్యుడు నాయని సుబ్బారావు కనిపించలేదని వెతుకుతూండగా, అనారోగ్యంతో మంచానపడిన నాయని ఓ చిన్నకాగితం మీద ఓ పత్యంరాసి పంపాడట. ‘‘కవితా మోహన మురళీవివశ సమస్తాంధ్ర జగతి విస్తృత కీర్తి ప్రవిభాస ఎనుబదేడుల నవకృష్ణా` కొనుము నాదానతులివె అన్నా’’ అని ఉందట. పద్యం చూచి కృష్ణశాస్త్రి కన్నీరు పెట్టాడట!!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img