Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

జాతర

డా. ఎన్‌. గోపి
ఈ మధ్య జీవితం
రెండోసారి జీవిస్తున్నట్టుగా వుంది
పునరావృతం కాదు
కొత్తగా కూడ వుంది.
రోజులు వచ్చాయీ వెళ్లాయి
అనుభవాలను
ఒంట పట్టించుకుని మరీ వెళ్లాయి
నడిచి వచ్చిన దారులు కూడా
ఎప్పటిలాగే వున్నాయి
లేవు కూడ.
గడిచిపోయిందేదీ
గతించలేదు
దాచుకున్నదేదీ
వొడిసి పోలేదు.
జాతర పాతదే కావచ్చు
మనుష్యులు కొత్తవాళ్లు
ప్రవాహం సాగుతూనే వుంది.
పక్షిలా వచ్చి వాలింది
న్యూస్‌ పేపర్‌
నా చూపుల్ని బుక్కుతూ
తాజా తాజాగా
మజా మజాగా
ఆలోచనలు పదునెక్కుతున్నాయి.
నిర్వచనాలను మానేశాను
మూల్యాంకనం శుద్ధ వేస్ట్‌!
జీవితాన్ని
జీవించడమే మంచిది
అది యాంత్రికత కాదు
అలజడుల మాంత్రికత.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img