Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

మానవ సంబంధాల సంఘర్షణ ‘ఆసు’

కళ్ల ముందున్న భౌతిక ప్రపంచానికి, మదిలో మెదులుతున్న/కదులుతున్న ఊహా ప్రపంచానికి మధ్య సమన్వయం చేసేవాడే కవి. రెండిరటి మధ్య తేడాను గమనిస్తూనే వాస్తవిక ప్రపంచంతో పాటు ఊహా ప్రపంచంలో విహరింపజేసేవాడే కవి. అందుకే ‘రవిగాంచని చోట కవిగాంచున్‌’ అన్నారు పెద్దలు. ఊహా శక్తికి, కల్పనాశక్తికి అవధులు ఉండవు అనేది జగమెరిగిన సత్యమే. అందుకే కవి యొక్క కల్పనా చాతుర్యము, అతను పాఠకులను తన్మయత్వంలో ముంచెత్తి ఆనంద పరవశులను చేస్తే ఆ ప్రక్రియ ఉద్దేశ్యం నెరవేరినట్లే. డా॥ వెల్దండి శ్రీధర్‌ గత మూడు దశాబ్దాలుగా సాహిత్యరంగంలో అనేక పాత్రలు పోషిస్తూ విభిన్నమైన రచనా దృక్పథంతో విమర్శ, కవిత్వం, పరిశోధన, కథారచన మొదలైన ప్రక్రియల్లో రచనలు చేస్తూ ఎప్పుడు మనల్ని పలకరిస్తూనే ఉంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వీరు అందరకీ సుపరిచితులే. ఇటీవలనే వీరు ‘ఆసు’ కవితా సంపుటిని వెలువరించారు. వీరు వృత్తిరీత్యా సహాయ ఆచార్యులు. ప్రస్తుతం పద్మశాలీల జీవితాలు ఏ దశలో ఉన్నాయో ‘ఆసు’ కవితను చదివితే కన్నీళ్లు రాక మానవు.
‘‘చినుకుల అలికిడి కోసం
నేల నేలంతా నోళ్లు తెరుచుకొని
ఎదురు చూస్తోంది/కాసింత పదన కోసం
దేహం దేహమంతా/కళ్ళు చేసుకొని చూస్తోంది’’
‘ఒక్క వాన కోసం’ శీర్షికతో ఉన్న ఈ కవితను చదివితే ‘వాన’ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసు కోవచ్చు. వాన అలికిడి కోసం ఎంతో కాలంగా భూమి అదే విధంగా కర్షకుడు ఒళ్లంతా కళ్ళు చేసుకొని ఎదురు చూడడం కొత్తేమీ కాదు. వాన చినుకులతోనే ప్రకృతి పులకరిస్తుంది. ఆ వాన చినుకు లేకపోతే ప్రకృతి, దానిపై ఆధారపడి మనుగడ కొనసాగించే చెట్టు పుట్ట మిగతా జీవజాలం ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ కవితను చదివిన తరువాత శ్రీశ్రీ మహాప్రస్థానంలోని ‘ప్రతిజ్ఞ’ కవిత గుర్తుకు వస్తుంది. అందులో కూడా ‘పొలాలనన్నీ హలాల దున్నీ, ఇలాతలంలో హేమం పండగ’ అంటూ కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం శరీర స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు అంటూ ముగిస్తాడు. వెల్దండి శ్రీధర్‌ కవితలో కూడా.
‘‘నాగటి మట్టిని ముద్దాడాలని, కుమ్మరి కుండ అమృతంతో నిండిపోవాలని, కమ్మరి కొలిమి భుగ భుగ మండిపోవాలని జాలరి వలలు కొర్ర మీనుల్ని కౌగిలించుకోవాలని, పనిముట్లన్నీ వాన స్పర్శతో జీవం పోసుకోవాలని’’ ఒక ఆశావాద దృక్పథంతో కవితను ముందుకు నడిపిన తీరు బావుంది.
‘‘కొంగబావతోని నునుగారపు సోపతి
ఈదులాడే ‘బంగారుతీగ’ల సోయగం
సాకలి బండ మీద వదులుతున్న ఊరి మురికి
నీటి అలల మీద ఆత్మగౌరవంతో
కదిలిపోతున్న కోటొక్క పూల సింగిడి’’ ఈ కవితలో కూడా ‘గుండె చెరువు’ పేరుతో నెర్రెలుబారిన చెరువును చూసి చలించిన హృదయంతో అక్షరాలలో పొదిగారు. చెరువు నిండినపుడు జలసిరులు, అందులోని బంగారుతీగలు, ఊర్లోని బట్టలు చాకలి రేవు చేరి మలినాన్ని చెరువు నీళ్లతో వదిలించుకొని మురిసి పోవడాన్ని విశదీకరించారు. అలాగే నీరు లేనపుడు ఎండిపోయి నెర్రెలుబారిన చెరువును అందరం కలిసి చేయి చేయి కలిపి బాగుచేయాలని చైతన్యపరుస్తూ ముగించటం బాగుంది. ‘‘చేయి చేయి కలుపుదాం! అరువు చేసైనా చెరువుకు ప్రాణం పోద్దాం!!’’ అనడం బాగుంది. చెరువు జీవకళతో, జలకళతో ఉంటేనే ఊరికి ప్రాణం. ‘‘ఎప్పుడు ఎవరు సెలవంటూ దూరం అవుతారో తెలీడం లేదు నిన్నటి దాకా కలిసి నడిచిన అడుగు కలిసి తిరిగిన భుజం/ చేయి కలిపిన చేయి మాట కలిపిన మాట ఇవాళ బూడిదల కలిసిపోతున్నాయి’’ ‘మట్టిపాట’ శీర్షికతో ఉన్న ఈ కవితను చదివిన తరువాత మనస్సు ఉద్వేగంతో నిండిపోయింది. పదాలు ముందుకు కదలలేదు. నిన్నటి వరకు భుజం తట్టి తోడు నడిచిన మిత్రుడో, రక్త సంబంధీకుడో తెల్లరాగానే చనిపోయాడన్న వార్త వింటే ఎంతగా కదిలిపోతామో! అంత ఉద్వేగభరితంగా సాగుతుందీ కవిత.
చివర్లో ‘‘మట్టిదెపుడూ తెర వెనక పాత్రే కానీ జీవన సూత్రాలన్నీ దాని చేతిలోనే. నడిపించేది గుండె చప్పుడే అనుకుంటాం. మట్టి హృదయపు సవ్వడి విన్న వాడిదే బతకు పల్లవైనా చరణమైనా’’ అంటూ ముగిస్తారు ఈ కవితను. ఇంతటి పరిపక్వమైన వాక్యాలు ఎవరికైనా జీవిత సారాన్ని జీవన గమనాన్ని అనుభవిస్తేనే అక్షరాల రూపంలో జాలువారుతాయి. అద్భుతం ఈ కవిత.
‘‘ఆటుపోట్లను/ బడబాగ్నులను
తన గుండెలోనే/ దాచుకునే నిశ్చల సముద్రం కుటుంబ భారాన్ని/ భుజానికెత్తుకొని
పొదరిల్లును పదిలంగా కాపాడే జీవగర్ర..’’
` ‘నాయిన’ శీర్షికతో ఉన్న ఈ కవితను చదివి భారంగా రాయాల్సి వచ్చింది. ఆ లోటును నేను కూడా అనుభవిస్తున్నాను. ఎంతగా రాసిన ఒడువని కావ్యం ‘నాయిన’. ఎంత చెప్పినా తీరని వేదన, రోదన నాయిన ధీరత్వం. నాన్నే కదా! ప్రతి కుటుంబానికి నాయకుడు. ముందుకు నడిపించే కెప్టెన్‌. నాన్న ఓ ఉద్వేగం, ఓ సముద్రం, నాన్న ఓ ప్రశాంత వాతావరణంలా కనిపించే అద్భుతశక్తి. నాన్న ఉన్న ప్రపంచంలో రంగురంగుల జీవితం నాన్నపోయాక రంగులువెలసిన జీవితం ఇంతకు మించి ఏమి రాయగలను కన్నీటి వాక్యాలు తప్ప.
‘‘సూర్యుని చుట్టు భూమి తిరిగినట్టు
పోగులన్నీ ఆసు చుట్టే తిరుగుతాయి
కళ్లతో పాటు చేతులు కూడా
ఆసు చుట్టూ ప్రదక్షిణ చేస్తాయి
ఏ వస్త్రమైనా అవ్వ మునివేళ్లలోనే పురుడుపోసుకుంటుంది’’
ఈ కవిత ‘ఆసు’ శీర్షికతో రాసింది. వస్త్రాలను తయారు చేసే యంత్రం ‘ఆసు’. దారాలన్నీ ఒక్కటై ‘ఆసు’ చుట్టూ తిరిగితేనే ఆకారం దాల్చుకుంటాయి. ఏ వస్త్రం ఐనా అవ్వ మునివేళ్లలో తయారు కావాల్సిందే అంటూ ఊచ నుండి దారాన్ని పీల్చడమంటే దేహం నుండి ప్రాణవాయువును త్యాగం చేయడమే. నాగలి లేనిదే పంటను పండిరచలేనట్లు ‘ఆసు’ లేనిదే వస్త్రాన్ని నేయలేం అనే పోలిక బావుంది. మరయంత్రాల ‘కాబూసు’లో చిక్కుకుపోయిన అన్న అస్థిపంజరమై తేలి శ్వాస కోసం తన్లాడుతున్నాడు. ఇప్పుడు ‘ఆసు’ మౌనంగా అశ్రువులను కారుస్తోంది అంటూ ముగిస్తారు ఈ కవితను.
ప్రపంచీకరణ పైత్యం నరనరాన జీర్ణించుకున్న మనిషి ఆధునిక యంత్రాలను ఆహ్వానించడం వలన పాత కాలం నాటి చేనేత మగ్గాలు మూలకు పడే స్థితి దాపురించింది. నేసిన వస్త్రంతోనే ఆత్మహత్య చేసుకోవడం అంటే చేనేతరంగం ఎంత దీనస్థితిలోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. జాతీయ జెండాను తయారు చేసే చేతులే నేడు పనిలేక పస్తులుండడం బాధ కలిగించే విషయం. ఈ కవితను చదివితే గోరటి వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’ అంటూ ‘సాలెల మగ్గం సడుగులిరిగినవి’ అన్న వాక్యాలు గుర్తుకు వచ్చినవి.
ఈ ‘ఆసు’ కవితా సంపుటిలో మొత్తం 60 కవిత లున్నవి. అన్నీ ఆలోచింపజేసేవే. ఒకటి అని చెప్పలేము. ఈ కవితా సంపుటి చదివితే ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో విషాదాలు కళ్లవెంట కదలాడుతాయి. పచ్చని సిరుల పంట, పొలాలు, చెరువులు, చిన్నప్పటి బాలాజి డిపో ఎక్కాల పుస్తకం, మట్టి పరిమళం, మోదుగుపూల వాసన, వాన చినుకుల ప్రాముఖ్యత, రొట్టె, బడిపిల్లలు, ఎండాకాలం, ఆఖరి మజిలీ.. ఇలా ఒకటేమిటి అన్ని కవితలు గుండెలోతుల్లోకి వెళ్లి మనిషిలోని మానవత్వాన్ని తట్టిలేపుతాయి. దీనికి జూకంటి జగన్నాథం ‘రోకు’ పేరుతో ముందుమాట రాసి పుస్తకానికి మంచి రూపం ఇవ్వటం కొసమెరుపు.
డా॥ మహమ్మద్‌ హసన్‌, 9908059234

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img