Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

విమర్శకాగ్రేసర

విందు పసందుగా ఉండాలి వంటకం కనువిందుగా ఉండాలి మీకు రుచి మాత్రమే తెలుసు ఆబగా తింటారు, ఆస్వాదిస్తారు నేను పాకశాస్త్ర విద్యాపారంగతుడిని నాకు వంటకాల పేర్లు తెలుసు వాటిలో వాడే పదార్థాలు తెలుసు పదG అర్థంR పదార్థం నా దగ్గర పడికట్టు రాళ్లున్నాయి ఎంత పిండికి ఎంత పంచదార కలపాలో నాకు తెలిసినంతగా మీకు తెలీదు నా దగ్గర లెక్కలు ఉన్నాయి నేను పాకశాస్త్ర విద్యాపారంగతుడిని మీకు రుచి మాత్రమే తెలుసు అందిందే తడవుగా ఆబగా తినేస్తారు పెదాలు నాకుతారు, బ్రేవ్‌మని తేనుస్తారు నేను ముందుగా వంటవాడి పేరు తెలుసుకొంటాను వాడి కుల గోత్రాలు ఆరా తీస్తాను రుచి మన తలకెక్కాలంటే వాడి ప్రాంతం గూడ తెలియాలి కదా! అందుకే ఇవన్నీని. ఇప్పుడు రుచి చూసి చెప్తా… ‘‘ఏదీ నా ఆకులో చక్కెర పొంగళి!’’ ‘‘రుచిగా ఉందని నీది కూడా నేనే ఆరగించా. సారీ. ఏమీ అనుకోకు’’. అల్లంసెట్టి చంద్రశేఖరరావు, సెల్‌: 9949605141

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img