Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

శేషేంద్ర ఆధునిక ఇతిహాసం ‘నా దేశం` నా ప్రజలు’

డా॥పి.వి.సుబ్బారావు, 9849177594

ఆధునికాంధ్ర కవిత్వంలో శేషేంద్ర అత్యంత ప్రతిభావంతుడు. బహు భాషా పండితుడు. ప్రతిభవ్యుత్పన్నత అభ్యాసం సమపాళ్లలో సముపార్జించుకున్న మహాకవి. తన కవితా ఇంద్రజాలంతో పాఠకులను మెస్మరైజ్‌ చేసిన విలక్షణ కవి. సరికొత్త ప్రతీకలతో, అభివ్యక్తితో అభ్యుదయ విప్లవభావాలను వ్యక్తీకరించిన శేషేంద్ర ముద్ర ఆధునికాంధ్ర కవిత్వంలో విశిష్టంగా విలసిల్లింది.
జీవిత విశేషాలు: గుంటూరు శేషేంద్రశర్మ నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు గ్రామంలో 1927 అక్టోబరు 20 వ తేదీన పండిత కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ‘అమ్మాయమ్మ, సుబ్రహ్మణ్యం’ దంపతులు. చిన్నప్పుడే ప్రాథమిక విద్యతో పాటు సంస్కృత సాహిత్యం, శాస్త్ర గ్రంథాలు స్వగ్రామంలోనే చదివారు. గుంటూరు ఏ.సి కళాశాల నుండి పట్టభద్రు లయ్యారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.యల్‌ పట్టభద్రులయ్యారు. పిఠాపురంలో డిప్యూటీ పంచాయితీ అధికారిగా ప్రారంభమైన ఆయన ఉద్యోగ జీవితం క్రమేపి హైదరాబాదు కార్పొరేషన్‌లో డిప్యూటీ కమీషనరుగా , మునిసిపల్‌ శాఖ కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఇంగ్లాండు, ఫ్రాన్స్‌, ఇటలీ, గ్రీస్‌, తూర్పు ఆఫ్రికా దేశాల్లో పర్యటించారు.
శేషేంద్ర రచనలు` కవితా విశేషాలు : శేషేంద్ర కవితా వ్యాసంగం తొలి రోజుల్లో నారికేళ పాకంలో హృద్యమైన పద్య రచనలో ప్రారంభమైంది. పద్య రచనల్లో కూడా సామాజిక స్పృహ ఉండేది. వచన కవిత్వానికి కొత్త శిల్పపు అందాలు సమకూర్చి మహోన్నత స్థానంలో వచన కవిత్వాన్ని నిలిపిన వచన కవితా శిల్పి శేషేంద్ర. ఆయన ప్రతీకలు, పద చిత్రాలు, వాక్య నిర్మాణం మొదలైన వాటిల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అభివ్యక్తిలో వింత పోకడలు చూపించాడు.
శేషేంద్ర రచనలను స్థూలంగా 1. వచన కవితా సంపుటాలు 2. ఆధునిక మహా కావ్యాలు (1. ఆధునిక మహా భారతం 2. జన వంశం) 3. విమర్శ గ్రంథాలు (1. షోడశరామాయణ రహస్యాలు, 2. సాహిత్యకౌముది) 4.కథలు (విహ్వల కథా సంపుటి) గా వర్గీకరించి పరిశీలించవచ్చు.

  1. వచన కవితాసంపుటాలు: 1. సొరాబు 2. చంపూ వినోదిని 3. ఋతు ఘోష 4. శేష జ్యోత్స్న 5.మండే సూర్యుడు 6.నా దేశంనా ప్రజలు 7. నీరై పారిపోయింది 8. గెర్రిల్లా 9. సముద్రంనా పేరు 10. ప్రేమలేఖలు 11. రక్తరేఖ 12. కవిసేన మేనిఫెస్టో 13. అరుస్తున్న ఆద్మీ మొదలైనవి వచన కవితా సంపుటాలు.
    శేషేంద్ర కవిగా, విమర్శకుడిగా సవ్యసాచిలా రాణించారు. కవిగా ఎంత ప్రసిద్ధుడయ్యాడో, విమర్శకుడిగా కూడా అంత ప్రసిద్ధుడయ్యాడు. ఆయన కాలరేఖలు విమర్శ గ్రంథానికి (1994) కేంద్ర సాహిత్యం అకాడెమీ అవార్డు లభించింది.
    శేషేంద్ర విద్యార్థిగా ఉన్నప్పుడు పుచ్చలపల్లి సుందరరామయ్యగారి ప్రభావంతో ఆయనలో మార్క్సిస్టు భావాలు గాఢంగా నాటుకున్నాయి. ఆనాటి తెలంగాణ రైతాంగ పోరాటంతో ఆయనలో వామపక్ష భావాలు రెక్కలు తొడిగాయి. అప్పటి నుండి ఆయన నిరంతర రచనా వ్యాసంగం వామపక్ష భావ స్ఫోరకంగా ఎన్నో ఉత్తమ కావ్యాలు రచించేందుకు దోహదం చేశాయి. శేషేంద్ర రచించిన ‘నా దేశంనా ప్రజలు’ కావ్య విశేషాలను వివరించడమే ప్రస్తుత వ్యాస ముఖ్యోద్దేశ్యం. శేషేంద్ర 1975 ఆగస్టులో భారతదేశం అంధకార బంధురంగా, స్వేచ్ఛారహితంగా ఉన్న ‘ఎమర్జెన్సీ’ కాలంలో ‘ నా దేశం నా ప్రజలు’ కావ్యాన్ని రచించాడు. తొలిసారిగా తెలుగు సాహిత్యంలో ఈ కావ్యానికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. దీని విశిష్టత వల్ల ఒకేసారి హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, తమిళం, కన్నడం వంటి భాషల్లో అనువదించి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలందుకొంది.
    ‘నా దేశంనా ప్రజలు’ విశిష్ట కవితా రీతులు ఈ కావ్యంలో ప్రధానంగా 1. శ్రామిక శక్తి ప్రశంస. 2. ప్రకృతి సౌందర్య పిపాస. 3. దేశభక్తి తత్పరత. 4. శ్రామికుడి నిర్వేదం. 5. గత చారిత్రక నిరసనం. 6. కాలచక్ర గమనం అధిక్షేపణ. 7. కవితా చైతన్య స్ఫూర్తిఅంతర్జాతీయ స్పృహ. 8. కవి ఆదర్శ సమాజ కాంక్ష ప్రకృతి వనరుల మమేకం వంటి కవితారీతులున్నాయి. వాటిని విశ్లేషిద్దాం.
  2. శ్రామిక శక్తి ప్రశంస: ఈ మహా కావ్యంలో నాయకుడు కవి. నాయకుడు, శ్రామికుడు. కవి తనకీ శ్రామికుడికీ అభేదాన్ని చెప్పుకున్నాడు. శ్రామిక వర్గ చైతన్యాన్ని ప్రబోధించాడు. కవి దృష్టిలో ఉత్పత్తికి కారకులైన కర్షకుడు, కవి, సాలెవాడు, వడ్డెరవాడు, సైనికుడు, శిల్పి మొదలైన వాళ్లంతా శ్రామికులే. లలిత కళాకారుల కోవకు చెందిన కవినీ, శిల్పినీ శ్రామికులుగా పేర్కొనటం శేషేంద్రవిలక్షణత. కేవలం ధాన్యం పండిరచేవిపొలాలు కాదు. ఉత్పత్తికి మూలమైందల్లా పొలమే. ఉత్పాదించిన వాడల్లా శ్రామికుడే.
  3. ప్రకృతి సౌందర్య పిపాస: కవి ఉషోదయంతో కళ్లు తెరిచి ఆవులిస్తూ కిటికీలోంచి పక్షులకు, మేఘాలకు సుప్రభాతం చెప్పి తన ప్రకృతి సౌందర్యం పిపాసను ‘‘సూర్యుడిచ్చిన ప్రియమైన కానుక నా దినం’’అని చాటుకుంటాడు. పక్షులతో, మేఘాలతో కలిసి ప్రకృతి సౌందర్యాన్ని పంచుకుంటానంటాడు.
  4. దేశ భక్తి తత్పరత: కవి తన ఊహల్లో ఆదర్శ సమాజం అందంగా ఉండేందుకు రస్తాలు వేస్తానంటాడు. మబ్బుల్లో అందమైన భవనాలు నిర్మిస్తానంటాడు. దేశ భక్తి తత్పరతతో ప్రాణాలతో నా దేశపు సరిహద్దు కుడ్యాలు లేపుతానంటాడు. పొరుగు దేశాలతో జరుగుతున్న యుద్ధాలన్నీ సరిహద్దు కలహాల వల్లే జరుగుతున్నాయి. చైనా యుద్ధం, పాకిస్తాన్‌ యుద్ధం ఆ విధంగానే జరిగాయి. అందుకే తన ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దుల గోడలను నిర్మిస్తానంటాడు. శత్రువుల గుండెలను చీల్చి చెండాడుతానంటాడు. నావలు చేసి వాటిలో జాతీయ జెండాలు నాటి సముద్రాల్లోకి విడుస్తానంటాడు. తన దేశభక్తి తత్పరతను దేశ దేశాలకు చాటి చెపుతానంటాడు.
  5. శ్రామికుడి నిర్వేదం: కవి శ్రామికుడితో మమేకం చెంది దోపిడీ సమాజంలో జరుగుతున్న దౌర్జన్యాన్ని నిరసిస్తాడు. శ్రామికుడికీ` చెట్టుకీ అభేదం చెప్పాడు. చెట్టుకి సంవత్సరానికొక వసంత శోభ దక్కుతుంది. తాను మనిషైనందుకు వసంత శోభ కోల్పోయానని నిస్పృహతో నిర్వేదం చెందాడు. నాగరికత ప్రభావంతో తన శ్రమశక్తి వల్ల పల్లెలు, పట్నాలు సుందరంగా తీర్చిదిద్దినా, తాను మాత్రం రిక్త హస్తాలతో దేశం కాని దేశంలో, తన కేమీ లేని ప్రదేశంలో ఉన్నానని నిర్వేదం చెందాడు. వట్టి చేతులతో మిగిలిపోయిన అతడిలో విప్లవ కాంక్ష రగులుతుంది.
  6. గత చారిత్రక నిరసనం: గత చరిత్రంతా ధనికులూ, భూస్వాములూ, భూర్జువాల ప్రాధాన్యంతో సాగింది. అందులో శ్రామికుడికి స్థానం లేదు. ‘‘గత చరిత్రలో శ్రామికుడి శ్రమఫలం దోపిడీకి గురై, దుర్మార్గానికీ, దౌర్జన్యానికీ బలై పోయిందని, శ్రామికుడితో తనకు అభేదం చెప్పుకున్న శేషేంద్ర గత చరిత్రలో తనకు తావు లేదని అధిక్షేపించాడు. వర్తమాన చరిత్రలో కూడా శ్రమ దోపిడీ జరుగుతుంది. అవినీతి, అక్రమాలు అందలమెక్కాయి. నీతిగా చెమటోడ్చే శ్రామికుడికి గుర్తింపు లేదు. భవిష్యత్తులో ఉంటుందన్న ఆశలేదు. అందుకే నిస్పృహతో చరిత్ర గమనాన్ని నిరపించాడు.
  7. కాలచక్ర గమనం` అధిక్షేపణ: కాలచక్ర గమనంలో వసంతం చక్రభమణం లాంటిది. క్షణాలు కాలాన్ని గుడ్డిగా అనుసరించే పరివారం కాదు. క్షణాలు శ్రామిక స్ఫూర్తికి సంకేతాలుగా మానవ చరిత్రను మార్చగల మహత్తు కలదంటాడు. శ్రమశక్తిని అణగదొక్కే కాలపు వెన్నెముకను ముక్కలుగా విరగ్గొడతానంటాడు. అసమ సమాజపు దిగంత రేఖలను చింపి చెరిపి వేస్తానంటూ అధిక్షేపించాడు.
  8. కవితా చైతన్య స్ఫూర్తి` అంతర్జాతీయ స్పృహ: ‘‘నిద్రావస్థలో ఉన్న గ్రామాలు అశాంతితో అలమటిస్తున్నాయి. ఉద్రిక్తత రక్తపాతంతో ఉరకలు వేస్తుంది. అందుకే ప్రజల్లో తన పద్యాల స్ఫూర్తితో చైతన్యాన్ని రగిలిస్తానంటాడు. ప్రపంచంలో ఎక్కడ శ్రామిక శక్తి దోపిడీకి గురవుతుందో, అక్కడ తన కవితా స్ఫూర్తి గుబాళిస్తుందని శ్రామిక పక్ష సానుభూతి ప్రకటించాడు.
  9. కవి ఆదర్శ సమాజ కాంక్షప్రకృతి వనరుల మమేకం: శేషేంద్రకు అసమ సమాజంపై కసి ఉంది. అందుకే తన మనసులో సముద్ర గర్భంలో ఉన్నంత అశాంతి ఉంది. వ్యవస్థపై తిరుగుబాటు చేయాలన్న కసి వల్ల రaంరaామారుతం లాంటి ఆవేశంతో చలించిపోతున్నాడు. కవి కల ఆదర్శ సమాజం. శ్రామికులకు సముచిత స్థానం, గౌరవం దక్కేది సమ పమాజంలోనే. కవి తన ఆదర్శ సమాజమనే కాలపు కాగితంపై లోకానికి రాసిస్తానంటాడు. తన ఊపిరితో సంతకం చేస్తానంటాడు. ఆదర్శ సమాజం కోసం అవసరమైతే కవి ప్రాణ త్యాగం చేస్తాడన్న భావన స్ఫురిస్తుంది. శ్రమ దోపిడీ చేసే దుర్మార్గపు కాలపు వెన్నెముక విరగ్గొట్టి నూతన శకాన్ని స్థాపిస్తానంటాడు. శ్రమ శక్తి వెలుగులో చైతన్య స్ఫూర్తికి సంకేతమైన సూర్యుడు అసంఖ్యాకమైన కిరణాలతో ప్రకాశిస్తున్నాడు. మొదట కవి ఆదర్శసమాజం కలను గూర్చి కన్నీరు కార్చిన చెట్టు ఇప్పుడు సంతోషంతో అభినందన పూర్వకంగా పూలజల్లు కురిసిందని చెప్పాడు. శేషేంద్ర ‘నా దేశం నా ప్రజలు’ కావ్యంలో శ్రామికవర్గ చైతన్యాన్ని గొప్పగా ప్రబోధించాడు. అందుకే ఈ కావ్యం ‘‘పలు జాతీయ అంతర్జాతీయ భాషల్లోకి అనువదించి కవికి జాతీయ అంతర్జాతీయ కీర్తిని తెచ్చిపెట్టింది. ఇంత గొప్ప కావ్యాన్ని రచించిన శేషేంద్ర ధన్యజీవి. భౌతికంగా ఆయన మన మధ్య లేకున్నా కవితా ప్రియుల హృదయాల్లో చిరంజీవి.
    (మే 30వ తేదీ శేషేంద్ర 18 వ వర్థంతి)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img