`కోనేటి నరేష్
సెల్:8499847863
పరితపిస్తోంది నాదేశం..
పరిణామం కోసమని..
పాలకోసం పసిపిల్లలు ఏడుస్తున్న నాదేశంలో
పుట్టలోని పాములకు
పాలు పోస్తోంది నాదేశం…
నాదేశంలో,,అంతస్థుల్లో ఒకడు
ఆకాశాన్ని తాకుతుంటే
అసమానతలతో మరొకడు
అట్టడుగునే మిగిలిపాయే
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న నా దేశం..
అవినీతిలో మాత్రం ముందుండె…
నా దేశంలో.. పార్టీల జెండాలు వేరైనా
వాటి ఎజెండా ఒక్కటే…ప్రజలను దోచుకోవడమే..
కార్మికుడి కష్టాన్ని దోచుకొనే కంపెనీలు…
కర్షకుడి కడుపుకొట్టే ప్రభుత్వాలు…
ప్రజా ధనాన్ని కలుగుల్లో ఎలుకల్లా
మేస్తున్న నాయకుల తీరు మారేదెప్పుడో…
నా దేశంలో..పాతిక సంవత్సరాల
వయస్సున్న యువత నిద్రపోతుంటే
పండు ముసలి నాయకులు
నా దేశాన్ని పాలిస్తుంటే…
ఈ యువతరం మేల్కొనేదెప్పుడో…
ప్రశ్నించేదెప్పుడో…పాలించేదెప్పుడో…
నా దేశలో…కాశ్మీరులో కల్లోలాలు
అస్సాములో అలజడులు
పంజాబులో మత్తుపదార్థాలు
ముంబయిలో మురికివాడ జీవితాలు మారేదెప్పుడో…
డెబ్బైఐదేళ్ల నా స్వతంత్ర భారతమా…
స్వాతంత్య్ర ఉద్యమ లక్ష్యాల
ఆశయాలను సాధించేదెప్పుడో…
అసమానతలు తొలిగేదెప్పుడో…
అభివృద్ధి సాధించేదెప్పుడో…
వాటి ఫలాలు పేదలకు చేరేదెప్పుడో…
సామాన్యుడి జీవితం మారేదెప్పుడో…
(అరసం యువ వచన కవితా పోటీలు`2023 లో కన్సొలేషన్ బహుమతి పొందిన కవిత.)