Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఏలుకోండి… ఏలుకోండి

వాడి
మోచేతి నీళ్ళకోసం
దోసిళ్లు పడుతున్న
అయ్యలార ఓరయ్యలార
అమాయక జనం
భవిత రాతలైన నేతలార
పంచుకొనీ పంచుకొనీ
ఏలుకోండి ఏలుకోండి
కష్టజీవులు సృష్టించే
సంపదను అప్పనంగ బొక్కేసి వాడు…
వాడు విదిల్చే ముక్కలు పీక్కుతిని మీరు…
మీరు విసిరేసే బొక్కలు
ఎన్నికల్లో మూడు వేలకీ
బిర్యానీ ప్యాకెట్టుకీ
లిక్కర్‌ బాటిల్కీ
అంగలార్చే అమాయక జనాల
పంచుకునీ పంచుకునీ
ఏలుకోండి ఏలుకోండి
బుర్రనింత గుజ్జున్నవాళ్ళు
బిజినెస్సుల్లో ఆరితేరి
భోషాణాల్లో డబ్బుదాచి
భుజాలు ఎగరేస్తున్నారు
వాళ్ళంతా మిమ్మల్ని మోస్తారు
ఎన్నికల్లో గెలిపిస్తారు
గెలవండి గెలవండి
పోలవరం లెకున్నా
ఉన్న ఉక్కు పోతున్నా
అమరావతి ఆగమైనా
పరిశ్రమలు రాకున్నా
ఉత్తుత్తి పోరాటం చేస్తున్న
ఉత్తరకుమారులారా
వృద్ధ మల్లయోధులారా
పోరాడండి పోరాడండి
మెడకు చుట్టుకున్న మీ కేసుల ఉచ్చులు
అలా వేలాడుతూనే ఉంటాయి
మీరు తోక రaాడిరచినపుడెల్ల
కొద్దికొద్దిగా బిగుస్తుంటాయి
ఎంత బిగిసినా అవసరం తీరేవరకూ
వాడు
మీ ఊపిరి ఆగనివ్వడు
భయపడకండి భయపడకండి
వ్యూహ ప్రతివ్యూహాలు పన్ని
ఎత్తుకు పైఎత్తులేసి
ఓటర్లను చీల్చిచీల్చి
పంచుకొని పంచుకొని
గెలవండి గెలవండి
జనం తిరగబడే ఆ రోజు వచ్చేవరకు
ఏలుకోండి ఏలుకోండి
– కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img