Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

శ్రీశ్రీని స్మరిస్తూ…

డా॥పి.సంజీవమ్మ
సెల్‌: 7569693239


కొల్లగొట్టుతనాన్ని నిరసిస్తూ
ధనస్వామ్య దుర్గాలను
బద్దలు కొట్టాలని ప్రబోధించినాడు.
శ్రమ శక్తిని సరుకుగా మారడాన్ని
ఎదిరించాలన్నాడు
కార్మిక కర్షక మేధావి వర్గాలు
ఏకం కావాలన్నాడు
గనిలో, వనిలో, కార్ఖానాలో
పనిచేసే వారంతా విప్లవించాలన్నాడు
నిరుద్యోగ బాటసారినీ
అడుక్కునే శక్తిలేక
బండరాతి పగిలి పడిఉన్న
‘భిక్షువర్సీయసి’ ని ఆదుకోమన్నాడు.
మహా ప్రస్థానం చాలదని
మరో ప్రస్థానం చేయాలన్నాడు
అడ్డంకులన్నీ అధిగమించాలన్నాడు
జనం సాయుధం కావాలన్నాడు
మరి ఈ ప్రస్థానం ఎవరికి?
ఒక జాతిని వేరొక్క జాతీ
ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ
కొల్లగొట్టడం అసాధ్యమయ్యే చోటికి
డబ్బు గబ్బు వాసన లేనిచోటికి
స్వాతంత్య్రం సమభావం
సౌభ్రాత్రం సహృదయం
వెల్లివిరిసే చోటికి
‘‘ఒకరు అందరికీ
అందరూ ఒకరికీ’’ అనే నినాదం
నిజమయ్యే చోటికి
కులవాదం కూలిన చోటికి
మతోన్మాదం మరణించిన చోటికి
సమాజవాదం సామ్యవాదం
శ్రమ జీవన సౌందర్యం
పుష్పించిన పూదోటలోనికి
వివక్ష రహిత, ద్వేష రహిత
దౌర్జన్య రహిత,
హింస రహిత, ప్రేమ సహిత
సమరస సంబంధాల సమాహారం
మానవసమాజ ఋజుమార్గం లోనికి
ప్రస్థానిద్దాం నేస్తమా!
శ్రీశ్రీని అనుసరిస్తూ
శ్రీశ్రీని స్మరిస్తూ`

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img