Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

‘అవును మాదే’


చిర్ర సతీష్‌ తాను తినకపోయినా...తన కడుపు మాడినా... తన రక్త మాంసాలతో... నిన్ను కడుపులో పెట్టుకొని ప్రాణం పోసిన అమ్మకు... నీ ప్రాణం మీద హక్కు ఉండదా! చెప్పులు అరిగేలా...కాదు కాదు... కాళ్లు అరిగేలా జీవితంలో పరిగెత్తి పరిగెత్తి... ఆఫీసుల్లో, బజారుల్లో, పొలాల్లో, ఫ్యాక్టరీల్లో, షాపుల్లో... చెమటలు కక్కి...ఆత్మగౌరవాన్ని మింగి...అవమానాలకు కృంగి... నీ పళ్లెంలో అన్నం పెట్టిన నాన్నకు నీ ప్రాణం మీద హక్కు ఉండదా? మేనేజ్మెంట్‌ల ముందు తల దించుకుని జీతం కోసం చేతులు చాచి...ఒక నెల జీవితాన్ని సాకలేక... చిరిగిన దుస్తులతో...అతుకుల బతుకులు ఈడుస్తూ... కటిక నేలపై పుస్తకాన్ని దిండుగా పరుచుకొని... పొద్దున్నే నీకు ఉత్సాహంగా అక్షరం తినిపించిన మాస్టారుకి నీ ప్రాణం మీద హక్కు లేదా? తోడుగా ఉన్న స్నేహితులకు ...ఎక్కడో ఉన్న బంధువులకు... అండగా ఉన్న తోబుట్టువులకు...కనిపెట్టుకొని ఉన్న కాలనీకి... బూచినీ పోగొట్టిన డాక్టర్‌కి... ఆటకి, పాటకి, బడికి, గుడికి నీ ప్రాణం మీద హక్కు లేదా? ఛల్‌ ఛల్‌ కాదు అంటే నేనొప్ప! నీ ప్రాణం మాది... నీ ప్రాణం మా ప్రాణం జీవితంలో అందరూ ఓడి ఓడి గెలిచిన వారే ఒక్క ఒటమికి...నిన్ను మేము ఓడనివ్వము ఒక్క క్షణంలో...నిన్ను జారనివ్వము ఈ జన్మలో నిన్ను వీడనివ్వము... నీ జీవితంలో ఏదైనా చేసుకో...ఓడిపో...ఓర్చుకో...గెలుచుకో... అది నీ ఇష్టం...కానీ నీ ప్రాణం మాది... నువ్వు మాకు ఇష్టం...చాలా ఇష్టం... ఆత్మహత్యలు వద్దు జీవితమే ముద్దు.
(అరసం యువ వచన కవితా పోటీలు`2023 లో
తృతీయ బహుమతి పొందిన కవిత.)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img