Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఎర్రశాలువ కబూతర్‌

ఎర్రశాలువ కప్పుకొని
మాయింటికొచ్చిందో కబూతర్‌
ఉద్యమించే వాళ్ళకోసం
మోసుకొచ్చిందో ఖబర్‌
మగత నిద్రలో మునిగినోళ్ళను
మేలుకొల్పులు పాడుతూ
లేలెండనంటోందీ ఖబర్‌
కదలండనంటోందీ ఖబర్‌
గగనవీధిలో కమ్ముకొచ్చే
ఫాసిజం మేఘాలు అవిగో
ఉరుములూ పిడుగులను రాల్చే
నాజీజం వడగళ్ళు అవిగో
మగత నిద్రలో జోగితే ఇక
మానవత్వం మసినుసే
లెండి ఇక లేలెండిరండని
హెచ్చరిస్తోందీ ఖబర్‌ ॥
జాతిజాతని హుంకరిస్తూ
మతం గొప్పలు బొబ్బరిస్తూ
మనువురాతలె శరణమంటూ
మనుషులను చీల్చే కుయత్నాల్‌
చూసిలెండని ఆపరండని హెచ్చరిస్తోందీ ఖబర్‌ ॥ ప్రభుత లోపాల్‌ చూసిచెప్తూ మనిషి హక్కుకు ప్రశ్నలేస్తే దేశద్రోహని ముద్రవేసే నోళ్ళునొక్కీ కుళ్ళబొడిచి జైళ్ళతోసే ప్రభుత తీరును చూసిలెండని కదిలిరండని
హెచ్చరిస్తోందీ ఖబర్‌ ॥
విపక్షాలను చీలగొడ్తూ
ప్రభుత్వాలను కూలదోస్తూ
ప్రజాస్వామ్యం నేలరాస్తూ
సాటి దేశాల్‌ వరసలో జన
స్వామ్య దేశం ఇదేనంటూ
ఫాసిజం నాజీల భక్తుల
మాయమాటల దుష్టచేష్టల
వేయినోళ్ళా ప్రచారాలా
నిగ్గుతేల్చీ ఎండగట్టే
సమయమిక వచ్చిందనంటూ
హెచ్చరిస్తోందీ ఖబర్‌ ॥
ఎర్రజండాలొక్కటై
కదలాలిరండని పిలుపునిస్తూ
కలిసివచ్చే జనంతోడై
పోరుకెళ్దాం పదండంటూ
ఊరువాడా హెచ్చరిస్తూ
చెప్పిపోతోందీ ఖబర్‌
ఎర్రశాలువ కప్పుకొన్న కబూతర్‌
అలసటెరుగక తిరుగుతోందీ కబూతర్‌
(శ్రీశ్రీ యాదిలో)
`ఏటుకూరి ప్రసాద్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img