Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

త్రిపురనేని హేతువాద సాహిత్యం

డా॥ కత్తి పద్మారావు

తెలుగు సాహిత్యంలో హేతువాద భావజాలం వేమన నుంచి బలంగా ప్రారంభమైంది. వేమన గొప్ప హేతువాద కవి. వేమన గురజాడకు, శ్రీశ్రీకి, చెరబండ రాజుకు మార్గదర్శకుడయ్యాడు. వేమన మార్గంలో హేతువాదాన్ని బలంగా తీసుకెళ్ళిన వాళ్ళు త్రిపురనేని రామస్వామి చౌదరి, తాపీ ధర్మారావు, మహాకవి గుఱ్ఱం జాషువా, శ్రీశ్రీ, ఆరుద్ర, సి.వి. కూడా హేతువాద భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళారు. హేతువాద భావజాలాన్ని ప్రచారం చేసిన వాళ్ళే కవులుగా, మహాకవులుగా ముందు కొచ్చారు. కవిత్వం కవిత్వం కోసం కాకుండా సమాజహితం కోసం, మానవాభ్యుదయం కోసం, మానవతా స్ఫూర్తి కోసం, సమసమాజ నిర్మాణం కోసం రాసిన హేతువాదులు తెలుగు సాహిత్యంలో బలంగా వున్నారు. త్రిపురనేని రామస్వామి చౌదరి సూత పురాణం, శంభూకవధ వంటి అనేక గ్రంధాల్లో దేవుళ్ళ పుట్టుపూర్వోత్తరాలను కళ్ళకు కట్టారు. ‘‘మల మల లాడు పొట్ట తెగమాసిన బట్ట కలంత బెట్టగా విల విల ఏడ్చుచున్న నిరుపేదకు జాలిని చూపుతున్న…
‘‘మల మల మాడు పొట్ట. తెగమాసిన బట్ట కలంత పెట్టగా
విల విల యేడ్చుచున్న నిరుపేదకు జాలిని జూపకుండ, ను
త్తల పడిపోయి జీవరహితంబగు బొమ్మకు నిండ్లు వాకిళుల్‌
పొలమును బోట్రనిచ్చెడి ప్రబుద్ధ వదాన్యు నిచ్చమెచ్చెదన్‌’’
హేతువాద భావజాలం
దేవుళ్ళకు పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మిస్తున్నారు. పట్టు వస్త్రధారణ చేస్తున్నారు. వజ్ర వైఢూర్యాలతో అలంకరిస్తున్నారు. కానీ నిరుపేద పొట్టకు అన్నం కరువైంది. పేదలేమో మసిబట్టలతో వున్నారు. దేవతా విగ్రహాలేమో పట్టు పీతాంబరాలతో వెలిగి పోతున్నాయి. రాళ్ళను పూజించే వాళ్ళు చక్ర పొంగలి ఆరగిస్తున్నారు. రాళ్ళుకొట్టే వాళ్కకేమో గంజిబువ్వ కూడా దొరకడం లేదు. ఈ వైరుధ్యాలను త్రిపురనేని రామస్వామి చౌదరి అలతి అలతి పదాలతో ఉత్పలమాలతో అద్భుతంగా చెప్పాడు. త్రిపురనేని రామస్వామి చౌదరి బ్రాహ్మణవాద భావజాలం మీద గొప్ప తిరుగుబాటు చేశాడు. రాముడికి 10 తలలు అంటే దశగ్రీవుడు అన్నాడు. కోయభాషలో దశగ్రీవ అంటే అర్థం కవిరాజు ఇలా చెప్పారు. దస అనగా బాధ. గీవ అంటే కలుగజేయువాడు అని అర్థం చెప్పాడు. రాక్షసుడు అంటే రక్షించువారు అని అర్థం చెప్పాడు. రావణుడు గొప్ప పండితుడు. గొప్ప రాజు. ఆయన్ని చంపడం అనేది కథకి ఒక పెద్ధ గ్రంధం ఎందుకు రాయాల్సివచ్చింది. అని ఆయన ప్రశ్నించాడు. కోయ, చెంచు మొదలగు జాతులు చింత తోపుల్లోనూ, చెట్టు పుట్టలలోనూ, అడవుల్లో జీవిస్తూ రాత్రులు బలంగా వుంటారు. తమ బిడ్డలను రక్షించుకునే రక్షకులుగా వుంటారు. అందుకే వీళ్ళను రాక్షసులు అన్నారు అని చెప్పారు. మూల వాసులకు వ్యతిరేకమైన నామవాచకాలు పెట్టి వారిని అన్‌ పాపులర్‌ చేయడానికి చూసింది బ్రాహ్మణ సమాజం.
తెలుగులో హేతువాద సాహిత్యం అష్టాదశ పురాణాలను తిరగదోడిరది. హేతువాద కవులు ముఖ్యంగా త్రిపురనేని రామస్వామి చౌదరి, గుర్రం జాషువా మహాకవి, తాపీ ధర్మారావు, ఆరుద్ర వంటి వారంతా మూఢ విశ్వాసాల మీద కొరడా రaళిపించారు. హేతువాద సాహిత్యం తెలుగు సాహిత్యానికి జీవ గర్ర ఎన్నో కొత్త విషయాలను బయటకు తీసుకొచ్చింది. తెలుగు వారు ఒకదశలో భారత రామాయణ భాగవతాలను గుడ్డిగా నమ్మారు. ముఖ్యంగా సినిమాల ద్వారా, నాటకాల ద్వారా, హరికథల ద్వారా, బుర్రకథల ద్వారా, ఈ కథలు ప్రచార మయ్యాయి. వాటిని హేతువాద నాస్తిక కవులు, రచయితలు తిప్పికొట్టారు. ఈ గ్రంథాలని హేతువాద దృక్పథంతో చూశారు. ముఖ్యంగా రామాయణంలో శంబుఖ వధ త్రిపురనేని రామస్వామి చౌదరి గట్టిగా ప్రశ్నించారు. ఒక శూద్రుడు చదువుతుంటే రాముడు తలనరకడం ఏమిటి అనేది ఆయన ప్రశ్న. ఆయన పురోహితుల దోపిడిని కూడా నిలదీశారు. కవిరాజు శంబుకవధ పురాణ సాహిత్యం మీద తిరుగుబాటు జెండాను ఎగురవేసింది. అవతార పురుషుల అఘాయిత్యాలను, దాడులను, హింసలను కవిరాజు నిర్భయముగా ఎత్తి చూపాడు. శంబుకుని చంపడం ఒక మహాత్కార్యముగా ఆర్ష సాహిత్యం వర్ణిస్తే శంబూకుని వధ ఒక హింసాకాండగా కవిరాజు వర్ణించాడు. శ్రీరాముడి క్రౌర్యం, బ్రాహ్మణవాద పరిరక్షణం ఈ నాటకంలో స్పష్టంగా అభివ్యక్తమయింది. శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి కవిరాజు శంబూకవధను గూర్చి వివరిస్తూ…
త్రిపురనేని హేతువాద విశ్లేషణ
‘‘ఈ ఘట్టములో శ్రీరాముడు చేసినది చెడ్డయని ‘శంబుకవధ’లో కవి నిరూపించెను. అది సత్యమైనను గొఱ్ఱెదాటుగా గొందఱుకుంది. రామ రామ యని చెవులు మూసికొనిరి. అవతార మూర్తికి అపనిందలు అంటగట్టిన రామస్వామి చౌదరికి రౌరవాది నరకముఓ స్థాలమేర్పఱిచిరి. ఈ గాలికూతలకు శాపనార్థములకు లొంగువాడుకాడు ఈ కవిరాజు.
శంబూకుని కథలో స్పష్టమైన హైందవ మతములోని కుళ్ళును వెళ్లడిరచడంలో కవిరాజు చేసిన పరిశ్రమ చూపిన ఆవేదన ఇంతయని చెప్పలేము. ఈ నాటకములో బీజ ప్రాయముగా గర్భితమైయున్న ‘ఆర్య ద్రావిడ భేదం గాధలే, తరువాత వచ్చిన సూత పురాణాలలో సమగ్ర స్వరూపము చెందినవి. రామాయణ భారత గాథలను గూర్చి కవిరాజు ప్రారంభించిన ఉద్యమము ఆదిలో దృశ్య కావ్యములలో ఆవిర్భవించి ఆవల, శ్రవ్యకావ్యములో ‘విశ్వరూపము’ దాల్చినది.’’ తమిళ కన్నడ సాహిత్యాల్లో కూడా కవిరాజు తీసుకువచ్చినంత తీవ్రమైన విమర్శ మరొకరు తేలేకపోయారు. శంబూకుడు శూద్రుడు. శూద్రుడెందుకు వేదం చదవకూడదు. వేదాల్లో ఆర్యుల గుట్టువుంది. ఆ గుట్టురట్టవుతుందని ఈ నిషేధం. ఏమిటాగుట్టు? ఆర్యులు అనార్యులను హింసించటం, వధించటం, మానభంగాలు చేయటం. ఈ వేదాలు శూద్రులు చదివినట్లయితే ఆర్యులు భారత భూభాగంపై ఎలా దండయాత్రలు చేశారో ఇక్కడున్న జాతులను ఏ విధంగా వర్ణ బేధంతో, విభజించారో యివన్ని అర్థమవుతాయని వేదాలు చదవడం నిషేధించారు. అందుకే శ్రీరాముడు ఆర్య సంస్కృతిని కాపాడటంలో భాగంగా శంబూకుడ్ని వధించాడు. దీన్ని నాటకంగా మలిచి త్రిపురనేని రామస్వామి నూత్న సాహితీ సంపత్తిని భావవిప్లవ వాదులకు చేకూర్చారనడంలో అతిశయోక్తి లేదు.
శంబుక వధ హేతువాద విశ్లేషణ
శంబుక వధ పీఠికలో అనార్యుల జీవన విధానాలను గురించి చాలా వివరాలిచ్చారు. అప్పటికీ పురాణాంశాలను చారిత్రకాన్వయాలతో పరిశీలించిన వారిలో ఆయన ప్రసిద్ధుడు. శంబుక వధ మీద బ్రాహ్మణ వాదులు తీవ్రమైన దాడులు చేశారు. నిందాభూయిష్టమైన విమర్శతో కవిరాజును అవమానించాలని చూశారు. కాని ఆయన అనార్యుల గురించి యిచ్చిన వివరణ వాస్తవాంశా సముచ్ఛయంగా, మరీ ముఖ్యంగా ద్రావిడులను గూర్చి ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.
సంస్కృతాన్ని బ్రాహ్మణేతరులు బాగా అధ్యయనం చేశారు. గొప్ప గొప్ప ఋషులుగా పేరుపొందిన వాళ్ళకు ఎందుకు గోత్రాలులేవు అని ప్రశ్నించారు. పుట్టుకనుబట్టి బ్రాహ్మణత్వమే కాదు అని వాదించారు. బ్రాహ్మణత్వమే ఒక అభూత కల్పన అని నిలదీశారు. అయితే అందరం బ్రాహ్మణులం కావాలి లేకుంటే అందరం శూద్రులు కావాలని వాదించారు. అంతేకాదు మొత్తం జంధ్య ధారణకు ఉపక్రమించారు. గోత్ర నామాలన్ని రూపకల్పన చేసినవే అని వ్యాఖ్యానించారు. అక్షరం అభ్యసించ డానికి ఆంక్షలు ఎందుకు అని ప్రశ్నించారు. మానవతా ప్రబోధం కోసం తమ కులాన్ని కూడా అవసరం అయితే వదులుకుంటామని కొత్త ధర్మాన్ని కూడా తీసుకొచ్చారు. బ్రాహ్మణేతరులలో పండితులు పదును గలిగినవారు. అప్పటి వరకు పురాణాలు చూసిన కోణానికి భిన్నంగా చూశారు. త్రిపురనేని రామస్వామి చౌదరి హేతువాద సాహిత్యం ఈనాటి సమాజానికి ఎంతో భావోజ్వలం కలిగిస్తుంది. మత, ఛాందస భావాల నుంచి బయటపడి పురాణ సాహిత్యాన్ని హేతుదృష్టితో చూడగలిగిన చూపునిస్తుంది. తప్పక ప్రతి తెలుగు వాళ్ళు త్రిపురనేని రామస్వామి చౌదరి సాహిత్యం అధ్యయనం చేయాల్సిన చారిత్రక సందర్భం ఇది.
సామాజిక తత్త్వవేత్త, ఫోన్‌ : 9849741695

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img