Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రమిద రావి రంగారావు
సాహిత్య స్వర్ణోత్సవ సంచిక

ప్రమిద మాస పత్రిక ప్రధాన సంపాదకుడు బులుసు వెంకట కామేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన రావి రంగారావు సాహిత్య స్వర్ణోత్సవ సంచిక. ఈ సంచికలో మినీ కవితోద్యమ సారధి అయిన రావి రంగారావు కవితా జీవనం గురించి, కవితా ఉద్యమాల గురించి అనేక మంది ప్రముఖుల అభిప్రాయాలు, వారి అనుభవాలతో ఒక ప్రత్యేక సంచికను తీసుకొచ్చారు ప్రమిద మాసపత్రిక సంపాదకులు.
పద్య కవిత్వం, భావ కవిత్వం, వచన కవిత్వం వంటివి అనేకం ఉన్నాయని కవిత్వాన్ని రాసి అనేక మంది చేత రాయించిన కవితా ఉద్యమకారుడు రావి రంగారావు ఆయన రాసిన అగ్గిపెట్టె, రేజర్‌లో సూర్యుడు, ముఖం పుల్ల, సూర్యరసం, రావి శతకం వంటివి కాక కుంకుడు కాయ కవిత ద్వారా ఎందరి మనస్సులలో నిలిచిపోయారు. ఆయన బందరులో ఉన్నంతకాలం సాహితీ మిత్రులు పేరిట నెలకు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎందరో కవులను ప్రోత్సహించిన ఆయన గుంటూరుకు వెళ్లిన తరువాత అమరావతి సాహితీ మిత్రుల పేరుతో కవితా సేవ చేస్తున్నారు. రావిరంగారావు కవితా సంకలనాలపై ప్రముఖుల అభిప్రాయాలను తెలుసుకోవాలంటే రావి రంగారావు సాహిత్య స్వర్ణోత్సవ సంచిక చదవాల్సిందే.
విష్ణుభొట్ల రామకృష్ణ, సెల్‌: 9440618122

ప్రమిద, రావిరంగారావు సాహిత్య స్వర్ణోత్సవ సంచిక,
వెల: రూ. 50/సంపాదకులు: ప్రమిద మాసపత్రిక ప్రధాన సంపాదకులు బులుసు వెంకట కామేశ్వరరావు, పేజీలు: 191, ప్రతులకు: ప్రమిద మాసపత్రిక, 101వసుంధర ఎన్‌క్లేవ్‌, నారాయణపురం, ఈడేపల్లి, మచిలీపట్నం, సెల్‌: 9885459193.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img