Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

ఇలాంటి రోజులు చూసేందుకేనా పతకాలు సాధించింది..?

కన్నీటి పర్యంతమైన వినేశ్‌ ఫోగట్‌

లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ బ్రిజ్ భూష‌ణ్‌ పై చ‌ర్యలు తీసుకోవాల‌ని టాప్ రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ లోని జంత‌ర్ మంత‌ర్‌ వద్ద గత కొన్ని రోజులుగా రెజ్లర్లు చేపడుతున్న ధర్నా కొనసాగుతోంది. ఈ క్రమంలో రెజ్లర్లకు (ఔతీవర్‌శ్రీవతీం), ఢిల్లీ పోలీసులకు మధ్య బుధవారం అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ తోపులాటలో అధికారులు తమపై దాడి చేశారని, దూషించారని అథ్లెట్లు ఆరోపించారు. ఈ సందర్భంగా టాప్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్ ‌ మాట్లాడారు.ఇలాంటి రోజులు చూడటానికేనా..! తాము పతకాలు సాధించింది..? అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ాఇలాంటి రోజులు చూడటానికేనా.. మేం పతకాలు సాధించింది. పోలీసులు దురుసుగా ప్రవర్తించడానికి మేమేమీ నేరస్తులం కాదు. ఘటనా స్థలంలో మహిళా పోలీసులు ఎందుకులేరు..? ఓ పోలీసు అధికారి తాగిన మత్తులో దుర్భాషలాడి, మాపై దాడి చేశాడు్ణ అంటూ వినేశ్‌ ఫోగట్‌ ఆరోపించారు.

కాగా, జంతర్‌మంతర్‌ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్ల కోసం ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతి బుధవారం రాత్రి మడత మంచాలు తీసుకొచ్చారు. అయితే వారికి వాటిని ఇచ్చేందుకు పోలీసులు అనుమతించలేదు. అనప్పటికీ వారు ట్రక్కు నుంచి మంచాలు, పరుపులను బయటకు తీయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో రెజ్లర్లు, ఎమ్మెల్యే అనుచరులు.. పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో రెజ్లర్లు బజరంగ్‌ పునియా , వినేశ్‌ ఫొగట్తోపాటు పలువురికి తలపై గాయాలయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img