Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈవోకు బెయిల్‌ మంజూరు

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణకు దిల్లీ హైకోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. ఎన్‌ఎస్‌ఈ ఉద్యోగుల ఫోన్‌ ట్యాంపింగ్‌తో సంబంధం ఉన్న మనీల్యాండరింగ్‌ కేసులో ఆమెకు బెయిల్‌ ఇచ్చారు. ఇప్పటికే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఢల్లీి కోర్టు ఆమెకు బెయిల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. సైబర్‌ సెక్యూర్టీ సంస్థకు అక్రమంగా 4.54 కోట్లు చెల్లించినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఆ సంస్థ ఎన్‌ఎస్‌ఈ ఉద్యోగుల ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు కేసు నమోదైంది.సైబర్‌ లోపాలను స్టడీ చేసేందుకు ఫోన్‌ కాల్స్‌ను పరీక్షిస్తున్నట్లు చెప్పిన ఆ సంస్థ రహస్యంగా టాప్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img