Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ఏడాది ఆలస్యంగా గమ్యానికి చేరిన రైలు..!


అవాక్కయిన అధికారులు
మన దేశంలో రైళ్ల రాకపోకలు అలస్యమవడం సాధారణమే. దేశంలో రైళ్లు ఆలస్యంగా గురించి జోకులు పేలుతూనే ఉంటాయి. నిర్దేశిత సమయానికి కంటే కొన్ని గంటల ఆలస్యంగా వచ్చిన సందర్భాలే ఎక్కువ. ప్రత్యేక రైళ్లు అయితే ఇంకా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఒక రైలు మాత్రం అధికారుల నిర్లక్ష్యం కారణంగా గమ్యానికి ఏడాది తర్వాత చేరుకుని ఆశ్చర్యానికి గురిచేసింది. గతేడాది మే నెలలో బియ్యం బస్తాలతో స్టేషన్‌కు రావాల్సిన గూడ్సు రైలు.. ఈ ఏడాది మే 17న చేరుకుంది. నోరెళ్లబెట్టే ఈ సంఘటన రaార్ఖండ్‌లో చోటుచేసుకుంది. రైలు ఆలస్యంగా చేరడానికి రైల్వే అధికారుల నిర్లక్ష్య వైఖరే కారణం. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ రైల్వేస్టేషన్‌లో గూడ్సు రైలు బోగిలో వెయ్యి బియ్యం బస్తాలను వేశారు. అక్కడ నుంచి 762 కిలోమీటర్లు ప్రయాణించి రaార్ఖండ్‌లోని న్యూ గిరిధీ స్టేషన్‌కు ఆ రైలు చేరుకోవాల్సి ఉంది. ఇంజిన్‌లో సాంకేతిక కారణాలతో అది నిర్ణీత సమయానికి బయలుదేరలేదు. తర్వాత దాన్ని అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. ఆ బోగితో గూడ్సు రైలు ఎట్టకేలకు ఏడాది ఆలస్యంగా మే 17న న్యూ గిరిధీ స్టేషన్‌ను చేరుకోవడంతో రైల్వే సిబ్బంది ఆశ్చర్యపోయారు. పేదలకు అందించాల్సిన ఆహార ధాన్యాలు ఏడాది ఆలస్యం కావడంతో.. 200-300 బస్తాల బియ్యం పాడపోయాయని అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. దీనిపై రైల్వే సిబ్బంది ఒకరి స్పందిస్తూ.. వ్యాగన్‌లో సుమారు 1000 బస్తాల ఆహార ధాన్యాలు ఉన్నాయని, వాటిలో 200-300 బస్తాలు చెడిపోయిన స్థితిలో ఉన్నాయని తెలిపారు. న్యూగిరిధీ స్టేషన్‌ మాస్టర్‌ పంకజ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఈ అంశంపై తుదుపరి విచారణకు మే 31న ఉన్నతాధికారులు ఇక్కడకు రానున్నారని పేర్కొన్నారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని, దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు డిమాండ్‌ చేశారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img