Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

ఏమాత్రం సారం లేని ప్రధాని ప్రసంగం : మల్లికార్జున్‌ ఖర్గే

ప్రధాని ఏమాత్రం సారం లేని ప్రసంగం చేశారని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ప్రధాని మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలపై రాజ్యసభలో ఆయన ్గ పెదవి విరిచారు. ప్రధాని తన ప్రసంగంలో, 2014 నుంచి ప్రభుత్వం చేసిన పనులు గురించి మాట్లాడరని, ఎల్‌ఏసీ వద్ద చైనా దురాక్రమణ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, రైల్వే రిక్రూట్‌మెంట్‌…తదితర అంశాలపై ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని అన్నారు. ఆయన మాటల్లో సారం అంటూ ఏమీ లేదని, ఆయన మాటలు ప్రభుత్వ వైఫల్యాలకు అద్దంపడుతున్నాయని విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img