Monday, April 22, 2024
Monday, April 22, 2024

పుల్వమాలో జైషే కమాండర్‌ కాల్చివేత

శ్రీనగర్‌ : భద్రతా దళాల సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రముఖ ఉగ్రవాద సంస్థ జైష్‌మొహ్మద్‌కు చెందిన టాప్‌ కమాండర్‌ శ్యామ్‌ సోఫి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జమ్మూ కశ్మీరులో బుధవారం చోటుచేసుకున్నట్టు పేర్కొన్నారు. కశ్మీరులోని పుల్వామా జిల్లాలోని ట్రాల్‌ ప్రాంతంలో ఉన్న టిల్వానీ మోహల్లాలో ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో భద్రతా దళాలు కార్డాన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించినట్టు పోలీసు అధికారి తెలిపారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతాదళాలు ప్రతి కాల్పులు జరిపాయన్నారు. ఆ క్రమంలోనే ఉగ్రవాది ఒకరు మృతి చెందారన్నారు. కశ్మీర్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ మృతి చెందిన ఉగ్రవాదిని జైషే కమాండర్‌ శ్యామ్‌ సోఫిగా గుర్తించామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img