Wednesday, August 17, 2022
Wednesday, August 17, 2022

భారీ వర్షాలకు మధ్యప్రదేశ్‌ అతలాకుతలం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మధ్యప్రదేశ్‌ అతలాకతలం అవుతోంది. భారీ వర్షాల ప్రభావం రాష్ట్రంలోని నాలుగు జిల్లాలపై తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోని శివపురి, ష్యోపూర్‌, గ్వాలియర్‌, దాతియా జిల్లాలలోని 1,171 గ్రామాలు వరదముంపునకు గురయ్యాయి. 200 గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో ఎంపీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అధికారుతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సహాయక చర్యలను వేగవంత చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img