Friday, May 31, 2024
Friday, May 31, 2024

యూపీ ఫలితాల తర్వాత ప్రత్యర్థులు కొట్టుకుపోతారు

ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య
కౌశాంబి : ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రత్యర్థి పార్టీలన్నీ కొట్టుకుపోతాయని, కమలం వికసిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య శనివారం అన్నారు. 403 అసెంబ్లీ సీట్లకుగాను బీజేపీ 300కి పైగా గెలుచుకుంటుందని చెప్పారు. ‘అంతకుముందు (2019 లోక్‌సభ) ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా దాదాపు అన్ని పార్టీలు ఏకమయ్యాయి. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కొక్కరుగా పోరాడుతున్నారు. ఎన్నికల తర్వాత ఈ మూడు-నాలుగు-ఐదు పార్టీలు చిత్తడి నేలకే పరిమితమవుతాయి. చిత్తడి నేలలో కమలం వికసిస్తుంది’ అని బీజేపీ ఎన్నికల గుర్తును ప్రస్తావిస్తూ మౌర్య పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి 60 శాతం ఓట్లు వస్తాయని అన్నారు. ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాల హయాంలో కేవలం ఐదు జిల్లాల్లోనే అభివృద్ధి పనులు జరిగాయని, బీజేపీ ప్రభుత్వ హయాంలో 75 జిల్లాల్లో అభివృద్ధి జరుగుతోందని అన్నారు. కాగా ఈనెల 27న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఐదవ దశలో కౌశాంబిలో పోలింగ్‌ జరగనున్నది. కాగా మిత్రపక్షం ఎస్‌పీ గుర్తుపై పోటీ చేస్తున్న అప్నా దళ్‌ (కామర్వాది) నేత పల్లవి పటేల్‌తో మౌర్య పోటీ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img