Friday, March 31, 2023
Friday, March 31, 2023

రోహిత్‌ వేముల ప్రతిఘటనకు చిహ్నం : రాహుల్‌

న్యూదిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సోమవారం దళిత విద్యార్థి రోహిత్‌ వేముల వర్థంతి సందర్భంగా సోమవారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ట్వీట్‌ చేస్తూ… ‘రోహిత్‌ వేముల వివక్షతో హత్య చేయబడ్డాడు మరియు అతని దళిత గుర్తింపుపై అవమానం జరిగింది’ అని పేర్కొన్నారు. ‘ఏళ్లు గడిచినా అతను ప్రతిఘటనకు, ధైర్యశాలిjైున తన తల్లి ఆశకు చిహ్నంగా మిగిలిపోతాడు. చివరి వరకు పోరాడినందుకు రోహిత్‌ నా హీరో, అన్యాయానికి గురైన నా సోదరుడు’ అని రాహుల్‌ అన్నారు. హైదరాబాద్‌ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌ వేముల (26) వేధింపుల కారణంగా 2016 జనవరి 17న ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. అతని మరణం ఉన్నత విద్యా సంస్థలలో కులతత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనను ప్రేరేపించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img