Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

వియాన్‌ ఇండస్ట్రీస్‌కు శిల్పాశెట్టి రాజీనామా

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి రాజ్‌ కుంద్రా సంస్థ వియాన్‌ ఇండస్ట్రీస్‌కు రాజీనామా చేశారు. తన భర్త రాజ్‌ కుంద్రాకు చెందిన చాలా వ్యాపారాల్లో శిల్పాశెట్టి భాగస్వామిగా ఉన్నారు. వియాన్‌ సంస్థ నుంచి శిల్పా ఎంత లాభం పొందారు అనే వివరాల సేకరణలో క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు నిమగ్నమై ఉన్నారు. అలాగే వియాన్‌ ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌గా శిల్ప శెట్టి ఎన్ని రోజులు పనిచేశారో తెలుసుకోవడానికి కూడా తెలుసుకుంటున్నారు. ఈ విషయంపై ప్రశ్నించేందుకు పోలీసులు మళ్లీ శిల్పను సంప్రదించే అవకాశాలు ఉన్నాయి. కాగా రాజ్‌ కుంద్రా చేసిన తప్పుల గురించి సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్లు శిల్పాపై ఆరోపణలు ఉన్నాయి. కుంద్రాకు చెందిన అడల్డ్‌ కంటెంట్‌ సంస్థ ‘కెన్రిన్‌’లో శిల్పా భాగస్వామిగా ఉన్నారని, చాలా మంది ఈ సినిమాల చిత్రీకరణలో నటించడానికి ముందు శిల్పాతో మాట్లాడినట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. రాజ్‌ కుంద్ర అరెస్ట్‌ తర్వాత శిల్పాశెట్టిని కూడా ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు శుక్రవారం రాత్రి పొద్దుపోయేంత వరకు ప్రశ్నించారు. శిల్పాను దాదాపు 6 గంటలపాటు పోలీసులు విచారించారు. తన భర్త ఎలాంటి అశ్లీల కంటెంట్ను ప్రొడ్యూస్‌ చేయలేదని, ఎరోటికాకు , పోర్న్‌ కు వ్యత్యాసం ఉంటుందని పోలీసులకు శిల్పా చెప్పినట్లుగా సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img