Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఆగని పెట్రో మంట

వరుసగా ఐదో రోజూ చమురు కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలోని లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 103.54 గా ఉండగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ. 92.12 లకు లభిస్తోంది. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.54కు లభిస్తుండగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ.99.92గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.104.23 చొప్పున ఉండగా.. డీజిల్‌ ధర రూ. 95.23 గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ. 101.01 ఉండగా.. డీజిల్‌ ధర రూ.96.60గా ఉంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.106.83 పలుకుతుండగా.. డీజిల్‌ ధర రూ.97.77గా ఉంది. లక్నోలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 100.60 ఉండగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ.92.55గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోలుపై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసల చొప్పున పెరిగాయి. తాజా పెంపుతో లీటరు పెట్రోల్‌ ధర రూ.108.02కు చేరగాగ, డీజిల్‌ ధర రూ.100.82కి పరిగింది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.109.70 కు లభిస్తుండగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ.101.74 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర రూ.108.93 ఉండగా.. డీజిల్‌ ధర రూ. 100.50గా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img