Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

కొవిడ్‌ చికిత్సకు రెండు కొత్త ఔషధాలను సిఫార్సు చేసిన డబ్ల్యూహెచ్‌వో

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ జనాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో నేపథ్యంలో కొవిడ్‌-19తో పోరాడేందుకు రెండు కొత్త ఔషధాలను ఉపయోగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్యానెల్‌ సిఫార్సు చేసింది.కొవిడ్‌-19 చికిత్స కోసం ఫైజర్‌ డ్రగ్‌ కోసం జపాన్‌ ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. కొవిడ్‌-19 రోగుల కోసం వీర్‌ బయోటెక్నాలజీ ద్వారా ఎలి లిల్లీ, గ్లాక్సో స్మిత్‌క్లైన్‌ అనే రెండు కొత్త ఔషధాలను ఉపయోగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్యానెల్‌ సిఫార్సు చేసింది. కార్టికోస్టెరాయిడ్స్‌తో కలిపి తీవ్రమైన కొవిడ్‌ -19 ఉన్న రోగులకు ఒలుమియంట్‌ బ్రాండ్‌ పేరుతో విక్రయిస్తున్న లిల్లీస్‌ బారిసిటినిబ్‌ డ్రగ్‌ ను సిఫార్సు చేసింది. ఆసుపత్రిలో చేరే ప్రమాదం ఎక్కువగా ఉన్న తీవ్రమైన రోగులకు జీఎస్‌కే వీర్‌ యొక్క యాంటీబాడీ థెరపీని షరతులతో ఆమోదించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img