Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

తాగితే చస్తారు’.. కల్తీ మద్యం మరణాలపై నితీశ్‌ ఘాటు వ్యాఖ్యలు

బిహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలవుతోంది. అయితే, కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవడం కలకలం రేగుతోంది. తాజాగా ఛాప్రా జిల్లాలో కల్తీ మద్యం తాగిన ప్రాణాలు కోల్పోయిన ఘటనపై రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై రెండు రోజులుగా బిహార్‌ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ‘తాగేసి వచ్చారా?’ అంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై బుధవారం విరుచుకుపడ్డారు. తాజాగా, ఇదే అంశంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘‘ఒకవేళ తాగితే చస్తారు’’ అని నితీశ్‌ అన్నారు.
కల్తీ మద్యం ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 39కు చేరుకోగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ‘‘గతసారి కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోతే పరిహారం ఇవ్వాలని కొందరు డిమాండ్‌ చేశారు.. మద్యం తాగితే ఎవరైనా చనిపోతారు.. దానికి ఉదాహరణ మన ముందు ఉంది.. దీనిపై సంతాపం తెలియజేస్తూ ఆయా ప్రదేశాలను సందర్శించి ప్రజలకు వివరించాలి.. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.. మద్యపానం మన రాష్ట్రంలో నిషేధించాం.. కొందరు అమ్ముతున్న కల్తీ మద్యం తాగి జనాలు చనిపోతున్నారు.. మద్యం చాలా ప్రమాదికారి.. కాబట్టి దానిని సేవించరాదు’’ అని అన్నారు.‘‘పేదలను పట్టుకోవద్దని అధికారులకు చెప్పాను.. మద్యం తయారీ, మద్యం వ్యాపారం చేసే వారిని పట్టుకోవాలి.. ప్రజలు ఏదైనా పనిని ప్రారంభించడానికి రూ. 1 లక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.. అవసరమైతే మేము మొత్తాన్ని సేకరిస్తాం కానీ ఈ వ్యాపారంలో ఎవరూ పాల్గొనకూడదు’’ అని నితీశ్‌ పిలుపునిచ్చారు. మద్యపాన నిషేధం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందనే నిర్ణయం తీసుకున్నామని సమర్దించుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img