Friday, May 3, 2024
Friday, May 3, 2024

ప్రధాని భద్రతా వైఫల్యంపై విచారణకు సుప్రీం ప్యానల్‌ ఏర్పాటు

న్యూదిల్లీ : పంజాబ్‌ పర్యటనలో ప్రధాని భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ న్యాయమూర్తి ఇందూ మల్హోత్రా నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మొత్తం కేసును విచారిస్తుందని తెలిపింది. చండీగఢ్‌ డీజీపీ, ఎన్‌ఐఏ ఐజీ, పంజాబ్‌, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌, పంజాబ్‌ ఏడీజీపీ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. పంజాబ్‌, కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీల విచారణను నిలిపివేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్‌ సూర్యకాంత, జస్టిస్‌ హిమాకోహ్లితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ప్రధాని భద్రతా వైఫల్యానికి కారకులు ఎవరన్నది సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిటీకి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఇటువంటి భద్రతా వైఫల్యాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన రాజ్యాంగబద్ధ చర్యలనూ ఈ ప్యానల్‌ సూచించనుంది. ఈ వ్యవహారంలో తీర్పును అత్యున్నత న్యాయస్థానం 10వతేదీన రిజర్వులో పెట్టింది. తమ మాజీ జడ్జి నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీల విచారణలను నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. లాయర్స్‌ వాయిస్‌ అనే సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన సుప్రీంకోర్టు పై ఉత్తర్వులు జారీచేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img