Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నాలుగు రోజుల పాటు భారీ వర్ష సూచన

ఇప్పుటికే భారీ వర్షాలతో దేశంలోని పలు రాష్ట్రాలు చిగురుటాకులా వణికాయి. వరదల ప్రభావం నుంచి ప్రజలు ఇంకా కోలుకోక ముందే వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్తను తెలిపింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోందని వెల్లడిరచింది. ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడిరచింది. ఈ అల్పపీడనం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా ఒడిశాపై ఈ అల్పపీడనం తీవ్ర ప్రభావాన్ని చూపించబోతోందని చెప్పింది. తెలుగు రాష్ట్రాలపై కూడా ప్రభావం ఉండొచ్చని వెల్లడిరచింది. మరోవైపు ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో పలు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img