Friday, April 26, 2024
Friday, April 26, 2024

త్వరలో ఒమిక్రాన్‌తో పోరాడే వ్యాక్సిన్‌

సీరం ఇనిస్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా
ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే టీకాపై ప్రయోగాలు కొనసాగుతున్నాయని.. త్వరలోనే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని సీరం ఇనిస్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా వెల్లడిరచారు. రానున్న 6 నెలల్లో ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశముందని తెలిపారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను అంత తేలిగ్గా తీసుకోవద్దని, అది సీరియస్‌ ఫ్లూగా పరిణమించే అవకాశం ఉందని తెలిపారు. కోవిడ్‌ నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు టీకాలు వేసుకున్నవారంతా బూస్టర్‌ డోస్‌ వేయించుకుంటున్నారు. ఒమిక్రాన్‌పై పోరాడే వ్యాక్సిన్‌ కోసం నోవావాక్స్‌తో కలిసి పనిచేస్తున్నామని, ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఏ 5పై సమర్థంగా పోరాడే వ్యాక్సిన్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని అదర్‌ పూనావాలా చెప్పారు. నోవావాక్స్‌ ప్రయోగాలు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయని, నవంబర్‌, డిసెంబర్‌ నాటికి అనుమతి కోసం అమెరికా నియంత్రణ సంస్థను సంప్రదించే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు. త్వరలో ఒమిక్రాన్‌ పై పనిచేసే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే బూస్టర్‌ డోస్‌గా ఆ టీకా అందిస్తే ఎంతో మేలని అదర్‌ పూనావాలా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img