Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

రాజ్యసభలో వాయిదాల పర్వం

న్యూదిల్లీ : రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుంచి వరుసగా మూడుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. 12మంది ఎంపీల సస్పెన్షన్‌, లఖింపూర్‌ ఖేరి హింస సహా అనేక అంశాలపై ప్రతిపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టడం, అధికార పక్షం అంగీకరించకపోవడంతో రాజ్యసభలో అరుపులు, కేకలు, గందరగోళ వాతావరణం నెలకొంది. ఎన్‌డీపీఎస్‌(సవరణ) బిల్లు, 2021పై ఓవైపు చర్చ కొనసాగుతుండగా ప్రతిపక్ష సభ్యులు ప్రజాసమస్యలపై చర్చించాలని నినాదాలు కొనసాగించారు. బిల్లుపై వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బీజేడీ సభ్యులు ప్రశాంత నందా సహా అనేకమంది బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. ఎస్‌పీ సభ్యురాలు జయాబచ్చన్‌ బిల్లుపై మాట్లాడుతుండగా అధికార పక్ష సభ్యులు అడ్డుతగిలారు. జయాబచ్చన్‌, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో చైర్మన్‌ స్థానంలో ఉన్న భువనేశ్వర్‌ కలిత సభను వాయిదా వేశారు. ఉదయం సభ సమావేశం కాగానే ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడిరది. తిరిగి సమావేశమైనా గందరగోళం కొనసాగడంతో రెండోసారి సభను మూడు గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు సభ సమావేశం కావడంతో న్యాయశాఖ సహాయమంత్రి సత్యపాల్‌ సింగ్‌ బాగెల్‌ మధ్యవర్తిత్వం బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును పరిశీలన కోసం స్టాండిరగ్‌ కమిటీకి పంపారు. అనంతరం ఒమిక్రాన్‌పై స్వల్పకాల చర్చ చేపట్టనున్నట్లు డిప్యూటీ చైర్మన్‌ హరివంశసింగ్‌ ప్రకటించారు. గందరగోళం మధ్యే బీజేపీ సభ్యుడు సయ్యద్‌ జాఫర్‌ ఇస్లాం చర్చ ప్రారంభించారు. విపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో చేసేది లేక సభను మధ్యాహ్నం మూడు గంటల వరకు వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img