Monday, May 6, 2024
Monday, May 6, 2024

అగ్ని-పి బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

బాలాసోర్‌ : భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. అగ్ని-పి(ప్రైమ్‌) బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష శనివారం విజయవంతం అయింది. ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి ఈ క్షిపణిని శనివారం ఉదయం 11.06 గంటలకు విజయవంతంగా ప్రయోగించినట్లు డీఆర్‌డీఓ వెల్లడిరచింది. ‘అగ్నిపి’ రెండు దశల సాలిడ్‌ ప్రొపెలెంట్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ అని తెలిపింది. ఇందులో డుయల్‌ రీడండర్ట్‌ నేవిగేషన్‌ ఉందని పేర్కొంది. తూర్పుతీరంలో ఏర్పాటు చేసిన పలు టెలీమెట్రీ, రాడార్‌, ఎలక్ట్రో ఆప్టికల్‌ స్టేషన్లు, నౌకల్లో అమర్చిన పరికరాలు క్షిపణి మార్గాన్ని అనుసరిస్తూ దాని పనితీరును పర్యవేక్షించాయి. నిర్దేశించిన ప్రమాణాలను అత్యంత కచ్చితత్వంతో క్షిపణి చేరుకుందని డీఆర్‌డీఓ వెల్లడిరచింది. జూన్‌ 28న అగ్ని-పి క్షిపణిని తొలిసారిగా పరీక్షించగా అది విజయవంతం అయిందని తెలిపింది. రెండవ ప్రయోగం ద్వారా క్షిపణి సామర్థ్యం మరింతగా తెలిసిందని పేర్కొంది. వెయ్యిరెండు వేల కిమీల దూరంలో ఉపరితలం పై నుంచి ఉపరితలం లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదిస్తుందని తెలిపింది. న్యూక్లియర్‌ వార్‌ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న నవతరం క్షిపణి ఇదని తెలిపింది. నేవిగేషన్‌, గైడెన్స్‌ వ్యవస్థను కలిగి ఉందని, అత్యాధునిక సాంకేతికతతో కూడిన రెండవ ప్రయోగంలో శాస్త్రవేత్తల అంచనాకు తగ్గట్లుగా ప్రదర్శన ఇచ్చిందని డీఆర్‌డీఓ వెల్లడిరచింది. అగ్ని`పి ప్రయోగం విజయవంతం కావడంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందనలు తెలిపారు. వ్యవస్థ అద్భుత పనితీరుపై హర్షం వ్యక్తంచేశారు. డీఆర్‌డీఓ చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీశ్‌ రెడ్డి కూడా శాస్త్రవేత్తల బృందాన్ని ప్రశంసించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img