Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

18,691 చెరువుల ఆక్రమణ

న్యూదిల్లీ: దేశంలో 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 9.45 లక్షల నీటి చెరువులను గుర్తించామని, అందులో 18,691 చెరువులు ఆక్రమణకు గురయ్యాయని కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి విశ్వేశ్వర్‌ తుడు ఓ ప్రశ్నకు సమాధానంగా సోమవారం రాజ్యసభకు తెలిపారు. రాష్ట్రాల వారీగా వివరాలను మంత్రి వెల్లడిరచారు. ఆక్రమణకు గురైన చెరువులు అత్యధికంగా తమిళనాడులో 8,366 ఉన్నాయని, తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్‌(3,920), తెలంగాణ(3.032) ఉన్నట్లు తెలిపారు. దేశంలో మొదటిసారిగా చెరువులు, నీటి సంఘాలపై లెక్కలు సేకరించామని, అందులో ఆక్రమణల సమాచారం బహిర్గతమైందని మంత్రి తుడు లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. సాగునీటి అవసరాలకు ఉపయోగించే చెరువులు, కుంటలను ప్రధానమంత్రి కృషి సంచాయీ యోజన(పీఎంకేఎస్‌వై)`హర్‌ ఖేత్‌ కో పానీ(హెచ్‌కేకేపీ) పథకం కింద మరమ్మతులు, ఆధునికీకరణ, పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img