Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

గుజరాత్‌ పోటీలో 35 మంది ముస్లింలు

గుజరాత్‌ రాష్ట్రంలో ఈనెల 7న పోలింగ్‌ జరగబోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో మూడవ దశలో భాగంగా 26కుగాను 25 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 266 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో ముస్లింలు కేవలం 35 మంది ఉన్నారు. ప్రధాన పార్టీలు టికెట్లు ఇవ్వకపోవడంతో ముస్లిం అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువ. ప్రస్తుతం పోటీలో నిలిచిన 35 మందిలో చాలా వరకు స్వతంత్ర అభ్యర్థులే ఉన్నారు. ఇంకొందరు చిన్న పార్టీలు లేక గుర్తింపు పొందని పార్టీల తరపున బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో 43 మంది పోటీ చేశారు. ఈసారి గాంధీనగర్‌ స్థానం నుంచి ఎనిమిది మంది ముస్లింలు పోటీ చేస్తున్నారు. ఇదే అధికం కాగా జామ్‌నగర్‌, నవసారి నుంచి ఐదుగురు చొప్పున బరిలో నిలిచారు. పటన్‌, భరూర్‌ నుంచి చెరో నలుగురు, పోర్బందర్‌, ఖేడా నుంచి ఇద్దరు చొప్పున పోటీ చేస్తున్నారు. అహ్మదాబాద్‌ ఈస్ట్‌, బనాస్కాంత, జూనాగఢ్‌, పాంచ్‌మహల్‌, సబర్‌కాంత నుంచి ఒక్కొక్కరు బరిలో ఉన్నారు.
రైట్‌ టు రీకాల్‌ పార్టీ, భారతీయ జన నాయక్‌ పార్టీ, సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ, గరీబ్‌ కల్యాణ్‌ పార్టీ, లోగ్‌ పార్టీ తరపున ముస్లింలకు టికెట్లు లభించాయి. ముస్లింలకు ప్రధాన పార్టీల ఆదరణ కరవు కాబట్టి స్వతంత్రంగా పోటీ చేస్తున్నాం. మా నివాస ప్రాంతాలన్నీ అనేక సమస్యలు ఉన్నాయి. కానీ స్థానిక నేతలు పట్టించుకోని కారణంగా అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు’ అని భరూచ్‌లోని జంబుసర్‌ తాలూకాలోగల సరోద్‌ గ్రామ సర్పంచ్‌ ఇస్మాయిల్‌ పటేల్‌ అన్నారు. తామ సమస్యలు పరిష్కారం కావాలంటే తమ వర్గ నాయకుడు ఉండాలని ముస్లింలు కోరుకుంటున్నట్లు
తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img