91 దేశాల్లో బీఎఫ్7 మాదిరి జన్యు సంబంధ..మ్యుటేషన్ ప్రొపైల్ ని పోలిన రకం 2021ఫిబ్రవరి నుంచి విస్తరణలో ఉందని..అంతిమంగా దీనికి బీఎఫ్ 7గా (బీఏ.5.5.1.7) పేరు నిర్ధారించినట్టు స్క్రిప్స్ రీసెర్చ్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా దీని వ్యాప్తి రేటు 0.5 శాతంగానే ఉన్నందున హెచ్చరికలను పునరుద్ధరించడం అర్ధరహితమని వైరాలజిస్టులు, ఎపిడెమాలజిస్టులు, అంటు వ్యాధుల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నో దేశాలలో 22 నెలలుగా బీఎఫ్ 7 వేరియంట్ ఉన్నప్పటికీ, కరోనా కేసులు గణనీయంగా పెరగలేదు. దీని వ్యాప్తి రేటు 0.5 శాతంగానే ఉన్నందున, దీనికి పరిమిత వృద్ధి సామర్థ్యమే ఉన్నట్టు తెలుస్తోంది’’ అని ఓ వైరాలజిస్ట్ పేర్కొన్నారు.