Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఆ చట్టాలు.. రైతుల వెన్నెముకను దెబ్బతీశాయి


: రాహుల్‌గాంధీ

మూడు సాగు చట్టాలు రైతుల వెన్నెముకను దెబ్బతీశాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గం కారస్సెరీ బ్యాంక్‌ ఆడిటోరియంలో జరిగిన కారస్సెరీ పంచాయత్‌, రైతుల సన్మాన కార్యక్రమంలో రాహుల్‌ మంగళవారంనాడు ప్రసంగించారు. దేశ రైతులు, వయనాడ్‌ రైతులు పెద్దగా ఏదీ కోరుకోరని, స్వచ్ఛమైన మనసునే ఆశిస్తారని, తమరంగంలో పోటీపడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు. అయితే, ఇవాళ రైతులకు అలాంటి స్వచ్ఛమైన వాతావరణం లేకపోవడం విచారకరమన్నారు. సాగుచట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు పోరాటం సాగిస్తున్నారని, వారి ఆందోళనను తాను అర్ధం చేసుకున్నానని చెప్పారు. వ్యవసాయరంగంలో ఎలాంటి బలహీనతలు లేవని అనడం లేదని, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ వ్యవస్థను ప్రభుత్వం మెరుగుపరచాలే కానీ నడ్డివిరచకూడదని అన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ, సాగు చట్టాల వంటి నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచాయని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img