Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రుతుపవనాలువచ్చేశాయ్‌

కేరళను తాకిన నైరుతి
మూడు, నాలుగు రోజుల్లో ఏపీకి…

న్యూదిల్లీ : నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు వాతావరణశాఖ తెలిపింది. దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించినట్లు వెల్లడిరచింది. రుతుపవనాలు గురువారం ఉదయం కేరళను తాకాయని ఐఎండీ అధికారికంగా ప్రకటించింది. లక్షద్వీప్‌, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని రోజులుగా చాలా రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ… ఈ కబురు ప్రజలకు ఊరట కల్పించినట్లు అయింది. మన దేశంలో 52శాతం నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40శాతం దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతు పవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఏడాది లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్యరేఖ వద్ద పసిఫిక్‌ మహాసముద్రం చల్లబడడం ఆగస్టు-సెప్టెంబరు నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఈ రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని గత నెలలో ఐఎండీ అంచనా వేసింది. వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 1951 నుంచి 2023 వరకు ఎల్‌నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్‌లో తొమ్మిదిసార్లు మంచి వర్షాలు కురిశాయని తెలిపింది. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది రుతుపవనాల కదలిక ఉందని వివరించింది. రుతుపవనాలు మరికొద్ది రోజుల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకు విస్తరించనున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, దిల్లీ, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నాలుగు రోజుల్లో ఏపీకి నైరుతి విస్తరిస్తుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈసారి ఏపీలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంటున్నారు. తెలంగాణలోనూ వారంలోగా రుతుపవనాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img