Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

రెండో రోజూ పెగాసస్‌ ప్రకంపనలు..


వాయిదా పడిన ఉభయసభలు
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల రెండోరోజూ పెగాసెస్‌ వ్యవహారంపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో ఉభయసభలు మధ్యాహ్నానికి వాయిదాపడ్డాయి. ‘పెగాసస్‌’ అంశంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకువచ్చారు. ఆ సమయంలో స్పీకర్‌ ఓం బిర్లా వారిని వెనక్కి వెళ్లాలని ఆదేశించారు. ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో నాలుగు నిమిషాలకే సభ వాయిదా పడిరది. లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. ఆందోళనల నడుమే ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు.సభ్యులు వెల్‌లోకి దూసుకురావడంతో.. సభను చైర్మన్‌ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img