Friday, November 1, 2024
Friday, November 1, 2024

ఘనంగా ఏఐటియుసి ఆవిర్భావ దినోత్సవం

విశాలాంధ్ర బ్యూరో- నెల్లూరు: కార్మికులహక్కుల కోసం పోరాడే వేదికనే ఏఐటియుసి అని ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని రేబాల వీధిలో గుజ్జుల యల్లమందరెడ్డి భవన్ వద్ద జరిగిన ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవ సభలో పలువురు వక్తలు అన్నారు. 1920 అక్టోబర్ 31న స్వతంత్ర సమరయోధులు లాలా లజపతిరాయ్ అధ్యక్షతన ఏఐటీయూసీ ఏర్పడిందని నాటి నుండి స్వతంత్ర పోరాటంలో కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయడంలో ఏఐటియుసి ముందుండి పోరాడింది ఈరోజు కార్మికులకు ఎన్నో చట్టాలు ఏర్పడ్డాయి అంటే అది కేవలం ఏఐటీయూసీ యొక్క పోరాట ఫలితమే అని చెప్పుటలో అని అతిశక్తి లేదని అన్నారు. భారతదేశంలో కార్మికుల హక్కుల నిర్మాణాల కోసం అవిరుల కృషిచేసిన కార్మిక సంఘం ఏఐటియుసి. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్ మాట్లాడుతూ ఏఐటియుసి పోరాటం చేసి ఎన్నో కార్మికులకు అవసరమైన చట్టాలను రూపొందించింది అని అయితే నేడు అధికారంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని అందులో భాగంగానే 29 కార్మికుల హక్కుల చట్టాలను రద్దుచేసి నాలుగు కార్మిక కోడ్ ఏర్పర్చి కార్మిక సంఘాలను పూర్తిగా లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నది. అలాగే కార్మికులను కార్పొరేట్ శక్తులకు ద్వారా వ్యక్తం చేస్తూ వారు సాధించుకున్నటువంటి హక్కులను కాలరాస్తూ బిజెపి ప్రభుత్వం ఆదాని అంబానీ లాంటి వారికి తొత్తులుగా మారిందని దేశంలో ఉన్నటువంటి జాతి సంపాదన కూడా కారు చౌకగా వారికి అందించే ప్రయత్నం బిజెపి చేస్తున్నది అందులో భాగంగానే ఈరోజు భారతదేశంలో రైల్వే, విమానాశ్రయాలను పోర్టులను ఎల్ఐసి లాంటి సంతులనే కాకుండా ముఖ్యంగా భారతదేశంలో ఉన్న జాతి సంపదను యావత్తును కొల్లగొట్టి కార్పొరేట్ శక్తులకు దారా దత్తం చేయడమే లక్ష్యంగా బిజెపి పని చేస్తున్నదని ఆయన ఆరోపించారు. మన జిల్లాలో ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న కృష్ణపట్నం పోర్టును ఆదాని నీకు అప్పజెప్పడం తో ఆపోర్టును పూర్తిగా నిర్వీర్యం చేసే దశకు తీసుకువచ్చారనిశంకర్ కిషోర్ ఆరోపించారు. తొలిత
యలమందారెడ్డి భవన్ వద్ద ఏఐడీసీ పథకాన్ని ఎగురవేసి అనంతరం రేబాల వారి వీధి పప్పుల వీధి ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతాలలో ప్రదర్శన నిర్వహించి యలమంద రెడ్డి భవనం వద్ద సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సభకు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం నాయకులు సంధాని భాష అధ్యక్షత వహించగా ఈ శాఖ ఈ సభలో సిపిఐ సీనియర్ నాయకులు మాజీ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వి రామరాజు, ఏఐవైఎఫ్
జిల్లా కన్వీనర్ మున్నా, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ముక్తి యార్ బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి సూర్యనారాయణ, ఏపీఎఫ్ డి సి నాయకులు సుధాకర్, డాల్విల్ వర్కర్స్ యూనియన్ నాయకులు శ్రీనివాసులరెడ్డి, ముఠా కార్మిక సంఘం నాయకులు, పెంచలయ్య, చెన్నయ్య, రమణయ్య, చెక్క రిక్షాకార్మిక సంఘంనాయకులు, సివిల్ సప్లైహమాలీసంఘం
నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img