Friday, November 1, 2024
Friday, November 1, 2024

కన్సల్టేటివ్‌ కమిటీ ఫర్‌ ఎక్స్‌ టర్నల్‌ ఎఫైర్స్‌సభ్యుడిగా ఎంపీ వేమిరెడ్డి

విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు: నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికీమరో అరుదైనఘనతనుదకింది . ఇప్పటికే పబ్లిక్‌ అండర్‌టేకింగ్స్‌ కమిటీ, ఫైనాన్స్‌ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన ఆయన మరో కేంద్ర కమిటీలో స్థానం సంపాదించారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఛైర్మన్‌గా ఏర్పాటైన కన్సల్టేటివ్‌ కమిటీ ఫర్‌ ఎక్స్‌టర్నల్‌ ఎఫైర్స్‌ సభ్యుడిగావేమిరెడ్డి ప్రభాకర్‌
రెడ్డిఎన్నికయ్యారు.ఈ కమిటీ లోలోక్‌సభ నుంచి10 మంది ఎంపీలు,రాజ్యసభ నుంచి10 మంది ఎంపీలు ఎన్నికవగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపీ వేమిరెడ్డిప్రభాకర్‌రెడ్డికిమాత్రమే స్థానందకిందిఈకమిటీవిదేశాంగ విధానాలు, కార్యక్రమాలు, పథకాలపై చర్చిస్తుంది. విదేశీ వ్యవహారాల బలోపేతంలో తనవంతు పాత్ర పోషిస్తుంది. తనపై నమ్మకంతో ఇంతపెద్ద బాధ్యతను అప్పగించిన కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ వేమిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపైచూపిననమ్మకాన్నితానుఎప్పటికీనిలబెట్టుకుంటానని,ఇప్పుడుతనకుఅప్పగించినకొత్తబాధ్యతలనునెరవేర్చడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img