Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

శ్రీరామ్ తాతయ్య ప్రచార యాత్రలో నిరసన సెగలు

ఆర్కే కు సమాధానం చెప్పాలని డిమాండ్

ఉధృత పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు

బొల్లా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని పలు అనుమానాలు

( విశాలాంధ్ర) వత్సవాయి : మండలం లోని తాళ్ళూరు గ్రామంలో శ్రీరామ్ తాతయ్య మొదలుపెట్టిన ప్రచార యాత్రలో తాళ్ళూరు గ్రామంలో బొల్లా రామకృష్ణపై ఇటీవల కాలంలో తాతయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని కోరుతూ గ్రామ సర్పంచ్ బొల్లా తులశమ్మ ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు తో సహా ప్రచార యాత్రకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తెదేపా అభ్యున్నతి కొరకు అహర్నిశలు శ్రమించిన రామకృష్ణను పార్టీలో ఉన్నా వెళ్లిపోయిన ఒరిగేదేమీ లేదంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఉదృత స్థాయిలో ఉద్యమాన్ని చేపట్టారు ఆర్కే వర్గీయులు…. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదా… ప్రజా హృదయాలను గొలుచుకున్నాడని గిట్లకి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ శాసనసభ్యుని నిలదీశారు… ఎట్టకేలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినది ఒకటైతే మరొక విధంగా వక్రీకరించారని బొల్లా రామకృష్ణ తెదేపాని గెలిపించుకోవడం కోసం పూర్తిస్థాయిలో మాతో పాటు వచ్చి సహకరించాలని సభాముఖంగా తాతయ్య తెలపడంతో ఆర్కే వర్గీయులు సంతోషం వ్యక్తం చేశారు…. ఏది ఏమైనప్పటికీ బొల్లా వర్గీయుల సెగలు నియోజక వర్గంమొత్తం వ్యాపించాయని పలువురు అభిప్రాయపడుతున్నారు…. ఎన్నికలలో బొల్లా రామకృష్ణ తెలుగుదేశానికి చేస్తారా ? లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? అనే అంశాలపై నియోజకవర్గంలో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి… వీటికి సమాధానం ఆర్కే ఎప్పుడు చెబుతారా అని పలువురు వేచి చూస్తున్నారని విశ్వసనీయ సమాచారం

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img