Friday, May 17, 2024
Friday, May 17, 2024

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

తెలంగాణ‌లోని వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. దీంతో నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేసింది. మే 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నది. ఈ నెల 27న పోలింగ్‌ నిర్వహిస్తారు. జూన్‌ 5న ఓట్లు లెక్కించనున్నారు.గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్‌ రెడ్డి గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈనేపథ్యంలో ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమయింది. కాగా, ఈ నియోజకవర్గం పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. ఈ ఉపఎన్నికకు నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఎన్నికల అధికారిగా ఈసీ నియమించింది. అభ్యర్థులు నల్లగొండ కలెక్టరేట్‌లో నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img