Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

అక్షరానికి సౌందర్యాన్ని అద్దిన ఆత్మీయ కథకుడు

తెలుగు కథా ప్రపంచంలో తనదైన ప్రత్యేకత కలిగిన గొప్ప కథకుడు, భావుకుడు, ప్రకృతి ప్రేమికుడు శ్రీపతి. కళింగాంధ్ర జీవన సజీవచిత్రాలే శ్రీపతి కథలు. తాము పుట్టి పెరిగిన ప్రాంతాలను ప్రేమించని వారు ఎవరూ ఉండరు. అయితే ఆ ప్రేమను గాఢంగా, చైతన్య వంతంగా మనసులో నింపుకుని ప్రాంతీయ వనరుల ప్రత్యేకతను, అక్కడి అద్భుత సౌందర్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని కథావస్తవుకు జతచేసి ఒక కావ్యంలా చిత్రించడం శ్రీపతికి మాత్రమే పట్టుబడిన గొప్ప కళ. భావుకుడైన ఈ కథకుడు తనలోని ప్రకృతి సౌందర్యారాధ నతోనూ, యాత్రోత్సాహంతోనూ, అద్భుత వర్ణచిత్రంలా రచనను తీర్చదిద్దుతారు. మంచుపల్లకి మరో తొమ్మది కథలు (పది కథలు), ఎల్లోరాలో వాళ్లు ముగ్గురు, (పది కథలు) సత్యజిత్‌ రాయ్‌ ఎవరు? (పదికథలు) బనారస్‌ చిత్రాలు (పదికథలు), కాటుక కళ్లు మూడు కథలు, కథాసంపుటాల్లో శ్రీపతి అత్యంత ప్రతిభావంతుడైన కథకునిగా మనకు సాక్షాత్కరిస్తారు.
‘‘విశేషమైన జీవితానుభవం, అనేక ప్రాంతాలను తిరిగొచ్చిన పర్యటనానుభవం, విస్తృత గ్రంధాధ్యయన జ్ఞానం శ్రీపతిని కథకునిగా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాయి. అతి సాధారణ మైన సంఘటనలోంచి, అసాధారణమైన జీవిత వాస్తవాలను దర్శించడంలో శ్రీపతిది నిశితమైన దృష్డి. భాషనీ, భాషకున్న ధ్వనినీ, ఆ ధ్వనికి ఉన్న అనంత శక్తినీ గుప్పిట్లో పట్టుకుని సన్నివేశానికి, పాత్రల అంతః చైతన్యావిష్కరణకు ఉపయోగించు కోవడంలో శ్రీపతి చాలా ప్రయోగాలు చేశారు. కృతకృత్య లయ్యారు కూడా. అలవోకగా పదచిత్రాలు గీయడం వారికి సహజమైన చేతివాటం. చాలా మంది కవులను కూడా ఆశ్చర్య పరిచే కాల్పనిక తీవ్రత వారి ఉద్వేగంలో కనబడుతుంది’’ ఇది శ్రీపతి గురించి ఎస్వీ భుజంగరాయశర్మ అభిప్రాయం. శ్రీపతి కథలు చదువుతుంటే ఒక కావ్యం చదువుతున్న అనుభూతిని పొందుతాం. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మధ్యతరగతి జనజీవితాలు, సముద్రతీరం, ఆ సముద్రపుగాలి, సరుగుడు తోటలు, తూర్పు కనుమల వరసలు, చెరుకుతోటలు, ఇక్కడి పల్లెలు, పల్లెప్రజల గొప్ప మానవీయత, కొందరి స్వార్థాలూ, కుతంత్రాలూ, ఆశలూ, విశ్వాసాలూ, కలలూ, కన్నీళ్లూ పదచిత్రా లుగా చిత్రించేరు శ్రీపతి తన కథల్లో. జీవనవాస్తవికతను బట్టి చూసినా, మంచికీ, మానవతకీ పట్టంకట్టి కథాసాహిత్య చరిత్రకు న్యాయం చేకూర్చే కథలు శ్రీపతి కలం నుంచి వెలువడ్డాయి. కథకు ఏపాటి వస్తువు కావాలసివుంటుందో..? దాన్ని కథగా ఎలా మలచుకోవాలో? మనసులో అంకురించిన కథను రచనలో ఒక కళా ఖండంగా తీర్చిదిద్దడానికి వెనక రచయిత ఏ మెళుకువలు కలిగివుండాలో? అనే ప్రశ్నలతో పాఠ్యాంశాల్లా ఒక కథావర్క్‌ షాప్‌ నిర్వహిస్తే మచ్చుతునకల్లా, కథా రచనలో విద్యార్థులకు సిలబస్‌లా ఉపయోగపడతాయి శ్రీపతి కథలు’’ అన్న మథురాంతకం రాజారాం మాటలు అక్షరసత్యాలు. శ్రీపతి కథలు మెత్తగా మృదువుగా సున్మితంగా ఉంటూనే కత్తిలా పదునుతోనూ ఉండడం విశేషం. సుమకోమ లమూ, వజ్రకాఠిన్యమూ ప్రేమకి రెండు పార్శ్వాలు అంటారు కదా. ఆ ప్రేమ అంతర్వాహినిగా రూపొందిన శ్రీపతి కథలు సుమకోమలత్వంతో హృదయవికాసాన్నీ, వజ్ర కాఠిన్యంతో దురన్యాయాల పట్ల ఆగ్రహాన్నీ ప్రకటిస్తాయి. ప్రేమ గురించి విశ్లేషించినా, మృత్యువు గురించి వ్యాఖ్యానించినా, పీడనకు వ్యతిరేకంగా బలపడుతున్న పీడితజన స్వరాన్ని వినిపించినా, శ్రీపతిది ఒక ప్రత్యేకమైన మార్గం. ‘‘ఔష్ట్రవతీవ శ్రీశీఙవ ఱం ్‌ష్ట్రవతీవ స్త్రశీస ఱం’’ ఈ టాల్‌ స్టాయ్‌ మాట తన విద్యార్థి దశలో ప్రధానోపాధ్యాయులు ఉడవల్లి సూర్యనారాయణ మూర్తి నోట వారి బోధనతో ప్రేమే భగవత్‌ స్వరూపమనే భావంతో కథాప్రపంచంలోకి అడుగుపెట్టిన శ్రీపతి తొలికథ ‘అన్నా చెల్లెలు’ అముద్రితం. అచ్చయిన తొలికథ ‘సహృదయ’ 1956 లో ప్రజామతలో వొచ్చింది. తొలి రోజుల్లో శరత్‌, టాగోర్‌ ప్రేమ్‌ చంద్‌ల లోకంలో ప్రయాణించినా, మహాప్రస్థానం యోగ్యతా పత్రంతో చలం పరిచయమై చలం వాక్యం, భాష, ఆ నిర్భీతి, తర్క ఔన్నత్యం, సత్యాన్వేషణ తీవ్రతలతో ఉక్కిరి బిక్కిరై ..స్త్రీ, ప్రేమలేఖలు, బిడ్డల శిక్షణ, చలం నవలలు, కథలు, వ్యాసాలతో చలం భక్తుడై పోయిన శ్రీపతి చలంతో జరిపిన ఉత్తరప్రత్యు త్తరాలతో ఓదార్పుపొంది రమణమహర్షికి భక్తుడయ్యాడు. చలాన్ని చదివిన తరువాత తెలుగు సాహిత్యంలోని ఇతర మహా రచయితల రచనలు, కొన్ని ఇంగ్లీషు అనువాదాలు రచయితగా తనని మరింత ప్రభావితం చేశాయని వినమ్రంగా చెప్పేవారు శ్రీపతి. జీవితాన్ని ప్రేమించిన వాడే ప్రపంచాన్ని ప్రేమించ గలుగుతాడని నమ్మిన ఉన్నత మానవుడు శ్రీపతి. ‘ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడే దేవుడుంటాడు’ అందుకే ఆ ప్రేమ సజీవంగా నిలుపుకోవాలి. అయితే సమాజంలో ప్రేమకు అడ్డుగానున్న అనేక అంశాలపై పోరు ప్రకటించకపోతే భగవంతుడనే భావనకు చోటు ఉండదనే గుంజాటనే శ్రీపతి తొలి కథల్లో కనిపిస్తుంది. ‘ఇక తెల్లవారింది’ ‘గొర్రెల కాపరి’ పెద్దల న్యాయం జనం, నక్సలైటు రాత్రులు, ఆటకట్టు, మొదలైన కథలు 70వ దశకం తొలిరోజుల్లో నక్సలైట్‌ ఉద్యమరూపంలో శ్రీకాకుళం జిల్లాలో తలెత్తిన సంక్షోభంలోంచి వొచ్చిన కథలు. కథారచయితగా తన పీడితజన పక్షపాతాన్ని ఆ కథలతో చాటుకున్నారు. శ్రీపతి బెనారస్‌ చిత్రాలు, నెమళ్ల అడవి వంటి కథలు ఆ కథల్లోని సౌందర్యాత్మకత చదివి పుస్తకం మూశాక కూడా పరిమళంలా మనచుట్టూ పరివ్యాప్తమైనట్టే ఉంటాయి. శ్రీపతి కథలు చదివాక గుండెకు చెమటపట్టి రక్తం కొత్త సంగీతంచేరి వొళ్లంతా ప్రవహిస్తున్నట్టుంటుంది. కళ్లు చెమరించి శిరసును అవనతం చేయించే శక్తేదో శ్రీపతి కథల్లో ఉందని ఒప్పుకోక తప్పదు. అతని చివర కథ ‘మామిడిపళ్ల ఊరు’ కొన్ని వ్యాసాలు కూడా రాయక పోలేదు. ఆ వ్యాసాలు కూడా కావ్యగుణం కలిగి వుండడం విశేషం. ఉద్యమాలవనం ఉదగదానం వెలుగు కిరణమై, ఉపాధ్యాయుడుగా పిల్లలకు పాఠాలు చెప్పి, ఆకాశవాణి దిల్లీ కేంద్రంలో న్యూస్‌ రీడర్‌గా రేడియో శ్రోతలకు పరిచయమైన పుల్లట చలపతిరావు దేశమంతా తిరిగి, అడుగుపెట్టిన ప్రతి చోటునూ అందంగా అక్షరీకరించి, దీప్తివంతమైన శాశ్వతత్వాన్ని కల్పించి తెలుగు సాహితీలోకంలో శ్రీపతిగా తన స్థానాన్ని పదిలపరుచుకున్న శ్రీపతి విరసం వ్యవస్థాపకుల్లో ఒకడిగా సాహిత్యలోకంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొంది, పర్యావరణ ప్రేమికుడిగా, చలం భక్తుడిగా అనేక మలుపులు తిరుగుతూ ఆధ్యాత్మిక ప్రపంచంలో తన గురువుగా శ్రీరామ్‌ బోధనలకు ఆకర్షితుడై చివరిరోజుల్లో భార్యా, కుమారుల హఠన్మరణా నంతరం ఎక్కడున్నాడో ఎవరికీ తెలియని స్థితిలో నిన్న ఒక ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచి సాహితీలోకాన్ని దిగ్భ్రమకి గురిచేశాడు. అక్షరానికి సౌందర్యాన్నదిన అద్భుత కథకుడు ఇప్పుడు మనకొక జ్ఞాపకంగా మారిపోయాడు. అతడు లేడు… అద్భుత సౌందర్యంతో తొణికిసలాడే అతని కథ ఉంది.

గంటేడ గౌరునాయుడు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img