Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అర్హులైన భార్యాభర్తలకు పెన్షన్‌ ఇవ్వాలి

ముప్పాళ్ల నాగేశ్వరరావు

తరతరాలుగా శ్రామిక ప్రజల కృషి, మేధోపరమైన ఆలోచన, సంపద సృష్టిలో వారి పోరాటం, నేటి ఆధునిక వ్యవస్థ ఏర్పాటుకు మూలం. పాత రాతియుగం నుంచి నేటి అణుయుగం వరకు జరిగిన ప్రతి ‘‘వృద్ధ్ధి’’ మానవ శ్రమ, వివేచనతో ముడిపడినదే. అలాంటి మానవుని వృద్ధాప్యం కడుదీనంగా, దైన్యంగా నిరాదరణకు గురికావటాన్ని సమాజ వైఫల్యంగా పరిగణించాలి. సిరిమంతుల కుటుంబాలలో తల్లిదండ్రులకు ఆర్థికేతర ఇబ్బందులు ఎదురుకావచ్చు. కాని కోట్లాది పేద, దిగువ, మధ్యతరగతి కుటుంబాలలోని వృద్ధులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతోపాటు మానసిక, సంరక్షణ, ఆర్థికపరంగా వర్ణనాతీతమైన బాధలతో కొందరు మృత్యువు కోసం ఎదురుచూడటాన్ని మనం గమనిస్తుంటాం. వృద్ధాప్యం శాపం కారాదు. పరిణతిచెందిన సీనియర్‌ సిటిజన్లు జాతి సంపదగా గుర్తించి గౌరవప్రదమైన, ఆరోగ్యవంతమైన, కనీస ఆర్థిక గ్యారంటీలతో కూడి హుందాగా జీవించే పరిస్థితులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వుంది.
వృద్ధులకు, వితంతువులైన అభాగ్యులకు, వివిధ కారణాలతో ఒంటరి మహిళలుగా కుటుంబ సంరక్షణ పొందలేని వారికి, విభిన్న ప్రతిభావంతులకు, ట్రాన్స్‌జండర్స్‌కు, దీర్ఘకాలిక వ్యాధులకు గురైనవారికి నేటి వరకు సరైన చట్టాల రక్షణ లేకపోవడం బాధాకరం. కనీస ఆదాయంలేని కీలకమైన కొన్ని వృత్తులలో ఉపాధి పొందుతున్న వారికి ఆర్థిక ప్రోత్సాహకాల్ని కల్పించి కాపాడవలసిన బాధ్యత కూడా మన ప్రభుత్వాలపై వుంది.
సమాజంలో సంపద సృష్టికర్తలైన కార్మికులు, సమస్త ప్రజలకు తిండిపెట్టే రైతులు లేకుండా మానవాభివృద్ధిని ఊహించలేం. అలాంటి రైతులు, కార్మికులతోపాటు పశుపోషకులు, జీవాల పెంపకందారులు, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, రవాణా కార్మికులు, ఆటో డ్రైవర్లు, షాపు గుమస్తాలు, చేతివృత్తులతో జీవించే చేనేత, గీత, మత్స్య, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మేదరి, పాదరక్షలుకుట్టే లాంటి చేతివృత్తులలోను, నిర్మాణ, ఉత్పత్తి రంగాలలో రెక్కలు ముక్కలు చేసుకుని, కుటుంబ పోషణతోపాటు సమాజాభివృద్ధికి, దేశాభివృద్ధికి పాటుపడేవారికి పదవీవిరమణకు నిర్ణీత కాలమంటూ లేదుగదా? అసంఘటిత రంగాలలో బతుకులీడుస్తున్న కార్మిక శ్రేణులు, షాపు గుమస్తాలు, సేల్స్‌ గరల్స్‌, ఇతర సేవారంగాలలోని అల్పాదాయ వర్గాలవారు, రెక్కాడితేగాని డొక్కాడదన్నట్లు కాళ్లు చేతులు పనిచేసినంత కాలం శ్రమిస్తూ జీవించేవారి వృద్ధాప్య రక్షణకు మన దేశంలో సరైన పథకాలేమీ లేవు. వీరితోపాటు సీనియర్‌ సిటిజన్లుగా ఉన్నవారికి కల్పిస్తున్న ప్రయోజనాలు, రక్షణలు కూడా సరిగ్గా లేవు. సమాజంలో 36 శాతంగా వున్న వృద్ధులతోపాటు విభిన్న ప్రతిభావంతులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పేద కళాకారులు, దీర్ఘకాలిక వ్యాధులతో అవస్థలు పడుతున్నవారు కనీస పెన్షన్‌ 10 వేల రూపాయలు వుండాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా వున్న భార్యాభర్తలిద్దరికీ చట్టబద్ధంగా పెన్షన్‌ ఇస్తున్నప్పుడు శారీరక శ్రమచేసే పై వర్గాలవారికి ‘‘కుటుంబంలో ఒక్కరికి పెన్షన్‌ ఇచ్చి పండగ చేసుకోండి’’ అనటంలో అర్థం లేదు. పైగా ఈ వర్గాలు పనిచేసే కేంద్రాల పరిసరాల పరిశుభ్రతా లోపాలు, వాయు, వాతావరణ కాలుష్యాలు, పోషక విలువలతో కూడిన ఆహారం కొనలేని ఆర్థిక పరిస్థితుల్లో శరీర పటుత్వం 50 సంవత్సరాలకే సన్నగిల్లుతుందనటం నిర్వివాదాంశం. గత నాలుగు సంవత్సరాల కాలంలో నిత్యావసర వస్తువులు, వైద్య సేవలు, మందులు తదితరాల ధరలు అపరిమితంగా పెరిగి జీవన వ్యయం అందుకోలేనంత అయింది. ప్రభుత్వాలు ఇస్తున్న పెన్షన్లు మాత్రం పాలకుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడి భిక్ష పొందుతున్నట్లు కాక, చట్టబద్ధ హక్కులతో కూడిన పెన్షన్లుగా సామాజిక పెన్షన్లను అమలుపరచాలి. ధరల పెరుగుదల, ఇతర పరిస్థితులను లెక్కించి ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లాగా గుణించి పెన్షన్‌ పద్ధతి అమలుచేయాలి.
ఇటీవల పెంచిన 3 వేల రూపాయల పెన్షన్‌ పెరిగిన ధరవరల రీత్యా ఏమాత్రమూ సరిపోదు. కనీస పెన్షన్‌ 6 వేల రూపాయలకు పెంచి అందించడంతోపాటు అర్హత కలిగిన భార్యాభర్తలు ఇద్దరూ జీవించివుంటే ఇద్దరికీ పెన్షన్‌ సదుపాయం కల్పించాలి. పెన్షన్‌ పొందు అర్హత వయస్సు 50 సంవత్సరాలుగా నిర్ధారించడం సమంజసంగా వుంటుంది. విభిన్న ప్రతిభావంతులు లేక వికలాంగులకు ఇస్తున్న పెన్షన్‌ను నెలకు రూ. 3,000 నుంచి రూ. 6,000కు తగ్గకుండా పెంచి వారికి కనీస మెరుగైన పరిస్థితులు కల్పించాలి. సీనియర్‌ సిటిజన్ల రక్షణార్థం తల్లిదండ్రుల పోషణ, వృద్ధుల సంరక్షణ చట్టం 2007ని సక్రమంగా అమలుచేసి తగు రక్షణలు కల్పించాలి. స్వార్జిత ఆస్తులు కలిగి ఉన్న సీనియర్‌ సిటిజన్స్‌ తమ బిడ్డల నిరాదరణకు గురైన సందర్భాలలో బ్యాంకులు రివర్స్‌ మార్ట్‌గేజ్‌ స్కీము అమలుచేసి ఆర్థిక వెసులుబాటు ఉండేలా చూడాలి. వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖతోపాటు ప్రత్యేక కమిషనరేటును ఏర్పాటుచేసి వృద్ధులు, వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధతో చర్యలు తీసుకోవాలి. ఉచిత వైద్య సదుపాయాలు, మందులు, ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు ప్రతి పెన్షన్‌దారునికి ఆధార్‌ కార్డువలే ప్రత్యేక ఆరోగ్య గుర్తింపు కార్డు అందించాలి. చట్టంలో పేర్కొన్న విధంగా ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆధునిక సదుపాయాలతో కూడిన వృద్ధాశ్రమాలు ఏర్పాటుచేసి ఉన్నతంగా నిర్వహించాలి. గ్రామీణ, పట్టణ వృద్ధులకు అవసరాన్నిబట్టి కుటుంబ, సమాజ వ్యవస్థల్లో చోటుచేసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో తగినన్ని వృద్ధాశ్రమాల ఏర్పాటును ప్రోత్సహించాలి. ఈ పెన్షన్లు పొందేవారందరికీ ప్రత్యేక ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలి. ఒంటరి మహిళలకు ఇస్తున్న పెన్షన్‌ వయసును 50 సంవత్సరాలకు పెంచడం సరైనది కాదు. తల్లిదండ్రుల రక్షణ కోల్పోకముందే 30 సంవత్సరాలు నిండిన ఒంటరి మహిళలందరికీ పెన్షన్‌ సదుపాయం కల్పించాలి. వివిధ పెన్షన్లు పొందుతున్న వారిలో 60 సం॥లు నిండిన వారందరికీ రైళ్ళల్లోనూ, ఆర్టిసి బస్సుల్లోను ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించి అందుకు తగిన పాసులు ఇవ్వాలి. విమాన ప్రయాణాలలో గతంలో ఉన్నట్లు సీనియర్‌ సిటిజన్లకు 50 శాతం రాయితీని పునరుద్ధరించాలి. వృద్ధులందరికీ చివరి శ్వాస వరకు బీమా సదుపాయం కల్పించాలి. ప్రీమియంలు ప్రభుత్వమే భరించాలి. సీనియర్‌ సిటిజన్లు బ్యాంకుల్లో దాచుకునే డబ్బుకు పదే పదే వడ్డీ రేట్లు తగ్గించటం సరైనది కాదు. అదనపు వడ్డీ రేట్లు కల్పించి వారి మెరుగైన ఆర్థిక స్థితికి తోడ్పడాలి.
రాష్ట్రంలో 28 రకాల సామాజిక పెన్షన్లు పొందుతున్న సుమారు 65 లక్షల మందిలో కుంటిసాకులు చూపి పెన్షన్లను రద్దుచేయరాదు. అర్హత కలిగిన కొత్తవారి అర్జీలను వారం రోజుల్లో పరిశీలించి అదే నెలలో మంజూరు చేయాలి. సంఘటిత రంగంలో వున్నవారు తమ సంఘటిత శక్తి ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందుతున్న విషయం మనం గమనిస్తూనే వున్నాం. రైతులు, రైతు కూలీలు, వివిధ అసంఘటిత రంగ కార్మికులు సంఘటిత రంగంలో వుండి నామమాత్రంగా కూడా పెన్షన్లు పొందలేని వారందరికీ గౌరవప్రదమైన జీవనానికి తగినంత స్థాయిలో పెన్షన్ల మొత్తాలను పెంచి ఇచ్చేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకోవాలి. పదవీవిరమణ అనంతరం నామమాత్రంగా పెన్షన్లు పొందుతున్న వివిధ విభాగాలలో పనిచేస్తున్న కార్మికవర్గం, ఇతర జీవన రంగాలలో ఉన్నవారు తమ పెన్షన్‌ పెంపు డిమాండ్ల సాధనకు సాగిస్తున్న ఆందోళనలకు ఏపీి సామాజిక పెన్షనర్ల, సీనియర్‌ సిటిజన్ల ఉద్యమం బలపరుస్తుంది.

సీపీిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి,
కన్వీనర్‌, ఏ.పీి. సామాజిక పెన్షనర్ల సంక్షేమ సంఘం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img