Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ఆరోగ్య కార్యకర్తల తీవ్ర కొరత

డా. జ్ఞాన్‌ పాఠక్‌

భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తల కొరత తీవ్రంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) తాజాగా హెచ్చరించింది. 2030నాటికి ఆరోగ్య కార్యకర్తల కొరత ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కోటిమందికిపైగా కొరత ఏర్పడవచ్చునని ఆ సంస్థ తెలిపింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో వైద్యులు, నర్సులు ఇతర కార్యకర్తల కొరత తీవ్రంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంది. ఈ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌ చెబ్రియేసిస్‌ మాట్లాడుతూ, ఆరోగ్య కార్యకర్తల రక్షణ, వారికి తోడ్పాటు సంఖ్యను పెంచడం అత్యవసరమని అన్నారు. 2020లో కొవిడ్‌ మహమ్మారి తలెత్తిన నాటినుంచి ప్రతి ముగ్గురి ఆరోగ్యకార్యకర్తలలో ఒకరు తీవ్రమైన ఆందోళనకు, వ్యాకులతకులోనై ఎంతో బాధపడ్డారని తెలిపారు. కరోనా సమయంలో రోగులకు చికిత్సఅందించడంలో ఆరోగ్య కార్యకర్తలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని అన్నారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఆరోగ్య వ్యవస్థలో మానవ వనరులపై ప్రపంచవేదిక ఐదవసమావేశంలో టెడ్రోస్‌ ప్రసంగించారు. ఈ సమావేశం ఏప్రిల్‌ 35 తేదీలలో జరిగింది. ఈ సమావేశంలో ఆరోగ్యనిపుణులు, ఆరోగ్య విధానరూపకర్తలు ఇంకా వివిధరంగాల నుండి ఆరోగ్య వ్యవస్థలో పనిచేసేవారు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ‘‘ఆరోగ్య కార్యకర్తల భద్రత, రక్షణ, ఆరోగ్యరంగంలో పెట్టుబడులు’’ అనే అంశంపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన గడువు 2030నాటికి ముగుస్తుంది. ఈలోపు 2030నాటికి అవసరమైన వైద్యులు, ఇతర నిపుణులు, ఆరోగ్య కార్యకర్తలు ఇతర సహాయకులు ఎంతమంది అవసరమవుతారనే అంశంపై కేంద్రీకరించారు. ఆరోగ్య సంక్షోభాన్ని నివారించేందుకుగాను ప్రపంచ ఆరోగ్యసంస్థ అనేక సూచనలు చేసింది. సంవత్సరానికి 812శాతం డిగ్రీ పొందిన ఆరోగ్యసిబ్బందిని ఆయాదేశాలు తయారు చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ కోరింది. ఉదాహరణకు ఒక దేశానికి మొత్తం 5000 మంది ఫిజీషియన్లు అవసర మైతే, సంవత్సరానికి 400`600 మంది ఫిజీషియన్లను తయారు చేసుకోవాలని ఆ సంస్థ సూచించింది. ఆరోగ్య కార్యకర్తల విభాగం డైరెక్టర్‌ జిమ్‌ కాంప్‌బెల్‌ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య భద్రత అవసరమని భావించినప్పుడు అన్నిదేశాలలో ఆరోగ్య పరిరక్షణ, చికిత్సలో సమానత్వం అవసరమని అన్నారు. నిపుణు లను తయారుచేసుకునేందుకు ఇప్పట్నించే తగినచర్యలు తీసుకోవాలని, అవసరమైన ఆర్థికవనరులు సమ కూర్చుకోవాలని సూచించారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరికలు, సూచనల నేపధ్యంలో భారతదేశం ఈ విషయంపై గట్టిగా ఆలోచించి ఆరోగ్య నిపుణులను, కార్యకర్తలను తయారు చేసుకోవలసి ఉంది. ఇప్పటికే నర్సులు, వైద్యులకొరత తీవ్రంగాఉంది. ఆరోగ్యబీమా ఇంకా ఇతర పథకాలు ఉన్నాయని గొప్పలు చెప్పు కోకుండా ఆరోగ్య నిపుణులను, కార్యకర్తలను తయారు చేసుకోవలసిన అవసరం ఎంతైనాఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని ఎయిమ్స్‌ ఆసుపత్రులలో 3,000మందికిపైగా వైద్యుల కొరత ఉంది. ఇంకా అనేక ఆసుపత్రులలో చాలా ఖాళీలు భర్తీ చేయకుండా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img