Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ఇప్పుడేం చేయాలి

ఇప్పుడేం చెయ్యాలి. నేనిప్పుడేం చెయ్యాలి. రా బావ ఏంటి ఏం చెయ్యాలని పాడుకుంటూ వస్తున్నావు. పార్వతి ఈరోజు మళ్లీ ఏవో పాటులు పాడుతున్నాడు. కాఫీ యిచ్చి మరల పాడిరచుకుందాం. నువు కూడా రా. అవును మా చెల్లి కూడ రావాలి. ఆమే కాదు మన దేశంలో ఓటున్న ప్రతివాడు వినాలి. విని నన్ను ఈ బాధ నుండి విముక్తి చేయాలి. అదిసరె యిప్పుడు నీకున్న బాధేంటి. నాకంటావేమిటి నీకు లేదా బాధ. నాకేం లేదుగాని నీ బాధేంటో చెప్పు. భలేవాడివయ్యా ప్రపంచ ప్రజలందరి బాధే నా బాధ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అలాగె ఓటున్న ప్రతి వ్యక్తి బాధె నా బాధ. నీవంటున్నావుగాని నాకేం బాధ లేదు. ఏంటి బాధ లేదా అయితే నువ్వు ఆలోచించడం మానేశావన్న మాట. అసలు ఈ ప్రపంచంలో బాధలేని మనిషిని ఒక్కడిని చూపించు. రోజువారి కూలి దగ్గర నుండి ప్రపంచ అగ్రనేత వరకు బాధలేని మనిషిని ఒక్కడిని చూపించు. జంతువులకు ఆలోచనా శక్తి లేదు.
ఒకదాని వెంట మరొకటి నడిచిపోతూ ఉంటాయి. కాని మనిషికి మెదడుంది. అతి ఆలోచిస్తూనే ఉంటుంది. కొంచెం విశ్రాంతి దొరికినప్పుడల్లా ఆలోచనలు మొదలవుతాయి. ఫలితంగా కొన్ని భావాలు, వాటి నుండి కోర్కెలు అవి తీర్చుకోవడానికి మనిషి ఉద్యమిస్తాడు. ఆ ఉద్యమానికి స్నేహ హస్తం కోసం ఎదురు చూస్తాడు. అది సరె యిదంతా ఎందుకు చెబుతున్నావు. అబ్బ ఏమి తెలియనట్లు నంగనాచి తుంగబుర్ర అన్నట్లు మాట్లాడతావు. నీకు ఓటుంది కదా. కొద్ది నెలల్లో ఎన్నికలు కదా ఎవరికేస్తావో చెప్పు. నేను ఆలోచించలేను. నువు మేధావి కదా మంచి రాజకీయ విశ్లేషకుడివి కదా చెప్పు. నీ నిర్ణయం నేను ఫాలో అవుతాను. నిజమె కాని ప్రస్తుతం కులమత వర్గాలతో కూడిన సమాజం. అందుకె ఏమీ ఆలోచించకుండా వారి నాయకులు చెప్పినట్లు ఓట్లు వేస్తున్నారు. కాని అది తప్పు.
ప్రతి వాడికి మెదడుంది. ప్రతి ఓటరు ఆలోచించి ఓటు వేయాలి. గత ప్రభుత్వం ఏమి చేసింది. సమాజంలో ఏ వర్గానికి ఉపయోగపడిరది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏ వర్గాలకు ఉపయోగపడుతోందని ఆలోచించాలి. ప్రస్తుతం అన్ని వర్గాల కు ఉపయోగపడాలంటె యిప్పుడున్న బడ్జెట్‌ చాలదు. ప్రస్తుతమున్న ఆర్ధిక పరిస్థితిలో ముందెవరికి ఉపయోగపడాలని నాయకులు ఆలోచించాలి. అబ్బ దానికి పెద్దగా ఆలోచించేదేముంది. జీవనం జరగని వాడిని బతికించాలి.
ఆ తరువాత వాడి వృత్తిని కొనసాగించడానికి ప్రభుత్వం సాయం చేయాలి? నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి. ముఖ్యంగా అందరికి అన్నం పెట్టె అన్నదాత రైతు సమస్య పరిష్కరించాలి. తరువాత ఊపిరి పీల్చుకున్నాక అభివృద్ధి వైపు అడుగిడాలి. నిజమె సంక్షేమ కార్యక్రమాల ద్వారా మనిషిని బతికించుకుని ఆ తరువాత అభివృద్ధి వైపు దృష్టి సారించాలి. ఈ రెండు సమాజాభివృద్ధికి రెండు కళ్లలాంటివి. ఇక ఆపు బావ. నీవు చెప్పిన ప్రకారం యిపుడెవరికి ఓటెయ్యాలి. ఓటు విషయానికొస్తే నేతల ఆలోచన ప్రవర్తన కూడ పరిగణనలోకి తీసుకోవాలి. ప్రతి ప్రభుత్వంలో మంచి చెడులు ఉంటాయి. అసలు చేసిన వాగ్దానాలు అమలు చేసే వారెవరనేది ముఖ్యం. ప్రతిపక్ష ప్రభుత్వం చేసే తప్పులు ఎత్తిచూపి ఏం వేయాలో వివరించి ప్రజల ముందు పెట్టాలి. అలాకాక ఏమీ చెప్పకుండ ఉన్న ప్రభుత్వాన్ని దిగిపొమ్మంటే ప్రజలు నమ్మరు. పోని వారు గద్దె ఎక్కితే ఇంతకంటె మంచి ఏం చేస్తారో చెప్పాలి. అదేదో సినిమాలో హైద్రాబాదుకు సముద్రాన్ని తెస్తా అన్నట్లు కాకుండ ఉన్న బడ్జెటు పరిథిలో ఇస్తున్న, చేస్తున్న వాటిని మించి ఏం చేయగలరో చెప్పాలి. అన్నింటికంటె నాయకుని వ్యక్తిత్వంపై ప్రజలకు నమ్మకం కలగాలి. అయితె ఇప్పుడేం చెయ్యాలి. నీ బుర్ర నాకు తాకట్టు పెట్టవద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకో.
సెల్‌: 9885569394

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img