Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఇప్పుడైనా ప్రత్యేక హోదా ఇస్తారా?

టి.వి.ఎస్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయాక మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓటమి పాలైంది. అనంతరం బీజేపీ ప్రభుత్వం ఏర్పడిరది. 2014 లో లోకసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని పదవి చేపట్టిన నరేంద్రమోదీ తాము గెలిస్తే తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తామని, పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామని, వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రతి ఏటా జిల్లాకు రూ.500 కోట్లు ఇస్తామని నరేంద్రమోదీ వాగ్దానం చేశారు. వివిధ రాష్ట్రాలకు వందల వాగ్దానాలు చేసి వాటిని అమలు చేయలేదు. వాగ్దానాలు నెరవేర్చక పోవడం మోదీ ప్రత్యేకత. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వంలోగానీ, అనంతరం వైసీపీ నాయకుడు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలోగానీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, పంచవర్ష ప్రణాళికను రద్దుచేసి, దాని స్థానంలో తెచ్చిన నీతిఆయోగ్‌ అనుమతించడంలేదని సాకుచెప్పి ఎగవేశారు. పదేళ్లు సాగించిన ప్రజా వ్యతిరేక, విద్వేష పాలన మూలంగా 2024 లోకసభ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు తగినన్ని సీట్లను బీజేపీ గెలవలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ, జనసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం సహాయం మోదీ ప్రభుత్వం ఏర్పాటుకు తప్పనిసరి అవసరమైంది. అలాగే బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ మద్దతు కూడా కచ్చితంగా అవసరం. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ను సాధించగలిగిన స్థానంలో ఉన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం, సుదీర్ఘ కాలం పోరాడి సాధించి విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టకుండా నిలవరించడం లాంటి అతి ముఖ్యమైన డిమాండ్లను సాధించవలసిన బాధ్యత చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వంపైన ఉంది. బహుశా ఇప్పటికే చంద్రబాబునాయుడు ఈ డిమాండ్లను మోదీతో మాట్లాడి ఉండవచ్చని ప్రజలు అనుకుంటున్నారు.
రాష్ట్రంలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు, మూడు లోకసభ సీట్లను బీజేపీ గెలుచుకోవడాని టీడీపీ, జనసేన అవకాశం కల్పించాయి. అందువల్ల చంద్రబాబునాయుడు రాష్ట్రానికి తప్పనిసరిగా అవసరమైన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణను సాధించగలరన్న ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే దాదాపు పదేళ్లుగా నిత్యావసరం వస్తువుల ధరలు పెరిగిపోతున్నా కేంద్రంలో మోదీ ప్రభుత్వం పట్టించుకోకుండా నల్ల ధన కుబేరుల సంఖ్యను పెంచడంలో తలమునకలై ఉన్నారు. నిరుద్యోగాన్ని, పేదరికాన్ని పెంచుతూ పరిపాలన చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు, కొనసాగటానికి సహాయపడుతున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వం కోరనున్న డిమాండ్లను తప్పనిసరిగా అంగీకరించవలసిన నైతిక బాధ్యత నరేంద్రమోదీ పైన ఉన్నది. అలాగే ఏపీకి కేంద్ర ప్రభుత్వం మంత్రి వర్గంలో కీలకమైన మంత్రిత్వ శాఖలు ఇవ్వడం ద్వారా రాష్ట్రం ఇప్పటికైనా అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పించాలి. రైతులను, కార్మికులను తీవ్రమైన కష్టాలకు లోనుచేయడం, మత ద్వేషాన్ని వెళ్లగక్కుతూ, మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చడానికి అన్ని ఏర్పాట్లు చేసిన మోదీ ప్రభుత్వం 2024 లోకసభ ఎన్నికల్లో దారుణంగా నైతికంగా ఓటమి పాలైందని చెప్పాలి. ప్రభుత్వం ఏర్పాటు అవకాశం కలిగినప్పటికీ ప్రజలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేసిన పరిస్థితి స్పష్టంగా తెలుస్తోంది. 110 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి ప్రజలను అప్పులపాలు చేశారు. ప్రజలకు చేసిన మేళ్లు ఏమీ లేకపోవడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు దేశాన్ని నాశనం చేశాయని, కుంభకోణాల్లో చిక్కుకుపోయామని విమర్శలు చేస్తూ, ఆ పార్టీ నాయకులను, తనను విమర్శించే ముఖ్యమంత్రులను సైతం అరెస్టు చేయించడం మోదీ ‘ఘనత’ అని చెప్పాలి. ఈసారైనా విద్వేషం విడనాడి రాష్ట్రం విడిపోయాక అంతగా అభివృద్ధికి నోచని ఆంధ్రప్రదేశ్‌కు సమాయపడాలి. గత పదేళ్లలో సాగించిన అరాచకాలను విడనాడి ఆదర్శనీయమైన నాయకుడని మోదీ అనిపించుకుంటారా?
చంద్రబాబునాయుడు, నితీశ్‌కుమార్‌ల మద్దతుతోనే ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతున్నానన్న అంశాన్ని గుర్తించాలి. చంద్రబాబునాయుడు 16 లోకసభ సీట్లను, నితీశ్‌కుమార్‌ 12 సీట్లను కలిగి ఉన్నారు. వీరి తోడ్పాటుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మోదీ 2014 లో అమరావతి రాజధానిగా శంకుస్థాపనకు వచ్చారు. ఈసారి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీ హాజరవుతారని తెలుస్తోంది. ఈ సందర్భంగానైనా ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాను ప్రకటించడమేగాక, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైనన్ని నిధులను ప్రకటించాలి. ఈ వాగ్దానాలను ఈసారైనా నెరవేర్చగలరని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి ఏర్పడిరదని భావిస్తున్న తరుణంలో చంద్రబాబు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ముందుగా ఆంధ్రప్రదేశ్‌కు, బిహార్‌కు ప్రత్యేక హోదాను ప్రకటించి రెండు రాష్ట్రాలకు సహాయం చేయాలి. 2014 లో శంకుస్థాపనకు వచ్చి చెంబెడు నీళ్లు, రాయి తెచ్చి ఇచ్చి అపహాస్యం పాలయ్యారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఎక్కువ ఆదాయం వచ్చే హైదరాబాదు తెలంగాణాకు వెళ్లింది. ఫలితంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిరది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచింది. రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కావలసిన అనేక అంశాలు అలాగే మూలపడి ఉన్నాయి. ముఖ్యంగా నదీజలాల సమస్య పరిష్కారం కావలసి ఉంది. 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు పొందిన మోదీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తగిన నిధులనూ మంజూరు చేయలేదు. అమరావతి రాజధానికి అభివృద్ధి చెందడానికి సైతం మోదీ సహకరించాలి. మోదీ మూడవసారి ప్రధానమంత్రి కావడానికి సహకరించిన వారి డిమాండ్లను నెరవేర్చవలసిన కనీస ధర్మం మోదీకి ఉంది. ఈ దిశగా చంద్రబాబు తగిన విధంగా ఒత్తిడి చేయాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img